Monday, January 20, 2025

ఘట్ కేసర్ లో పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్ ప్రెస్

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ పరిధిలోని ఎన్ఎఫ్ సి నగర్ సమీపంలో గోదావరి ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది. నాలుగు బోగీలు పక్కలు ఒరగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రైల్ వేగం తక్కువగా ఉండడంతో పెను ప్రమాదం తప్పిందని రైల్వే అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు ప్రయాణికులకు ప్రాణహాని జరగలేదన్నారు. ఆ మార్గంలో వెళ్లే రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రైల్వే సిబ్బంది అక్కడికి చేరుకొని ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News