Friday, November 15, 2024

ముంచుకొస్తున్న వరద

- Advertisement -
- Advertisement -

కృష్ణా, గోదావరి బేసిన్లలో నిండిన ప్రాజెక్టులు

వరద నియంత్రణపై అప్రమత్తంగా ఉండండి రాష్ట్రాలకు కేంద్ర జల హెచ్చరికలు నిండుకుండల్లా
కృష్ణా ప్రాజెక్టులు అల్మట్టి నుంచి శ్రీశైలం వరకూ అన్ని రిజర్వాయర్లు ఫుల్ మిగిలిన ఖాళీ 67టిఎంసిలే
తెలుగు రాష్ట్రాల ప్రాజెక్టులో 46టిఎంసిల కుషన్ 88% నిండిన నాగార్జున సాగర్ రోజుకు 38టిఎంసిల చేరిక
రేపు ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత గోదావరికి మళ్లీ వరద భయం భద్రాచలం వద్ద 46 పెరిగిన
నీటి మట్టం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ బుధవారం సాయంత్రానికి 55 అడుగులకు చేరే అవకాశం
లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక

లోతట్టు ప్రాంత ప్రజలు
అప్రమత్తంగా ఉండాలని సూచన

మన తెలంగాణ/భద్రాచలం: భారీ వర్షాలు, ఎగువనున్న ప్రాజెక్టుల నుంచి వస్తున్న నీటితో భద్రాద్రి వద్ద మళ్లీ గోదావరికి వరద పోటెత్తుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భ్ర దాచలం వద్ద మంగళవారం రాత్రికి గోదావరి నీటి మట్టం 46 అడుగులకు చేరింది. దీంతో కలెక్టర్ అనుదీప్ మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కాగా, జిల్లాలో రెండు రో జులుగా వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఇదిలా ఉండగా, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మరోవైపు దు మ్ముగూడెం మండలం పర్ణశాల వద్ద సీతమ్మ వాగు పొంగడంతో నార చీరల ప్రాంతం, సీతమ్మ తల్లి విగ్రహం నీట మునిగింది. నెల రోజులు గడవకముందే మరోసారి గోదారమ్మ ఉగ్రరూపం చూపే ప్రమాదం కన్పించడంతో భద్రాద్రివాసులు ఆందోళనలో మునిగిపోయారు. మొన్నటి వరదతో అతలాకుతలమైన జనం ఈసారి ఎటువంటి ఉప్రదవాన్ని మోసుకోస్తుందోనన్న ఆందోళన జిల్లావాసుల్లో కన్పిస్తోంది. జులైలో ఊహించని విధంగా ఉగ్రరూపం దాల్చిన గోదావరి జిల్లాలోని ఏజన్సీ ప్రాంతాన్ని అతలాకుతలం చేసింది. దాంతో భద్రాచలం, మణుగూరు, దుమ్ముగూడెం, చర్ల మండలాలకు తీవ్ర నష్టం జరిగింది. భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం పరిసర ప్రాంతాలు జలమయమయ్యాయి.

పట్టణంలోని పలు కాలనీలు నీట మునిగాయి. జనం కట్టుబట్టలతో మిగిలారు. భారీగా పంట నష్టం సంభవించింది. రాకపోకలు నిలిచిపోయాయి. జనజీవనం స్థంభించింది. సిఎం కెసిఆర్ భద్రాచలం వచ్చి ముం పు ప్రాంతాలను పరిశీలించారు. వరద బాధితులకు రూ. 10వేలు, నిత్యావసర సరుకులు అందజేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పుడిప్పుడే పరిస్థితి కుదుటపడుతుండగా.. నెల గడవ ముందే మళ్లీ గోదావరికి వరద పోటెత్తడంతో ఏజన్సీవాసులు ఆందోళనలో చెందుతున్నారు. ప్రాణహిత, ఇంద్రావతి నదుల నుంచి వస్తున్న భారీ వరద నీటి కారణంగా గోదావరి నీటి మట్టం గంటగంటకు పెరుగుతోంది. బుధవారం సాయంత్రానికి 55అడుగులకు వరద పెరిగే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. జిల్లా యం త్రాగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద 9లక్షల 4వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలను బట్టి అర్ధరాత్రి కి రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. అధికారులు వరద పరిస్థితి, సహాయక చర్యలను పరిశీలిస్తున్నారు. వరద పెరిగితే ప్రజలను పునరావాస కేంద్రాల్లోకి తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజలు వాగులు దాటే ప్రయత్నం చేయవద్దని, ప్రమాదాలు సంభవిస్తాయని కలెక్టర్ హెచ్చరించారు.

గోదావరికి మళ్లీ వరద భయం

ఎగువన మహారాష్ట్ర, చత్తిష్‌గడ్,ఒడిశా తదితర రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి ఉపనదులు పొంగిప్రవహిస్తున్నాయి. గోదావరినదిలో వదర ప్రవాహం అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. మంగళవారం రాత్రికి భద్రాచలం వద్ద నదిలో నీటిమట్టం 45.20అడుగులకు చేరింది. దీంతో ఇక్కడ మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఎగువ నుంచి వస్తున్న 10,21,807క్యూసెక్కుల వరదనీరు ప్రవహిస్తోంది. భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకొని ఉదయానికి గోదావరిలో నీటిమట్టం మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టు అంచానా వేస్తున్నారు.

మేడిగడ్డ వద్ద గోదావరి పరవళ్లు

మహారాష్టలో కురుస్తు భారీ వర్షాలతో ప్రాణహిత నదిపరవళ్లుతొక్కుతోంది. త్రివేని సంగమం వద్ద గోదావరిలో వరద ఉధృతి అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. ఎగువ నుంచి శ్రీరాం సాగర్ ప్రాజెక్టులోకి 39680 క్యూసెక్కుల నీరు చేరుతోంది. ఈ ప్రాజెక్టులో 86శాతం నీటినిలువ ఉంది. ప్రాజెక్టు నుంచి బయటకు 31863క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దిగువన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి 1,19,281క్యూసెక్కుల నీరు చేరుతుండగా ,అంతే నీటని బయటకు విడుదల చేస్తున్నారు. మేడిగడ్డ వద్ద గోదావరిలో 6,87680క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉండగా , బ్యారేజి 85గేట్లు తెరిచి అంతే నీటిని దిగువకు వదిలిపెడుతున్నారు. లోయర్ మానేరు ప్రాజెక్టులోకి 32,111క్యూసెక్కుల నీరు చేరుతుండగా, 21277క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేస్తున్నారు. కడెం ప్రాజెక్టులోకి 4509క్యూసెక్కుల నీరు చేరుతుండగా , 2022క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేస్తున్నారు.మంజీరా నదిలో కూడా వరద ప్రవాహం పెరిగింది. సింగూరు ప్రాజెక్టులోకి 25594క్యూసెక్కుల నీరు చేరుతుండగా , ప్రాజెక్టు నుంచి 19000క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News