Wednesday, February 12, 2025

పంట పొలాల్లో గోదావరి వరద ప్రవాహం

- Advertisement -
- Advertisement -

దండేపల్లి : గోదావరి నదిలో వరద ప్రవాహం ఉదృతంగా ప్రవహించడంతో గోదావరి ఒడ్డున ఉన్న పంట పొలాల నుండి నది ప్రవహించడంతో రైతుల పంట పొలాలు మునిగాయి. దండేపల్లి మండలం ద్వారక గోదావరి నది పంట పొలాల నుండి శుక్రవారం నది ఉదృతంగా ప్రవహిస్తుంది. గోదావరి ఒడ్డున గల శివాలయం ముందు నుండి గోదావరి నది చిన్న పాయ పంట పొలాల నుండి ప్రవహించడంతో రైతులు సాగు చేసిన పత్తి పంట, వరి పొలాలు నీట మునిగాయి.

వ్యవసాయ పంపు సెట్ల కోసం ఏర్పాటు చేసిన విధ్యుత్ స్థంభాలు లేల కూలాయి. విద్యుత్ సరఫరా నిలిచింది. రెండు రోజుల నుండి పంట పొలాల నుండి వరద ప్రవాహం ప్రవహించడంతో పంటలు నీట మునగడంతో పాటు భూముల్లో గుంతలు పడ్డాయని బాధిత రైతులు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు.

వేలాది రూపాయలు పంటలపై పెట్టుబడులు పెట్టగా వర్ష భీభత్సంతో కడెం ప్రాజెక్టు, శ్రీరాంసాగర్ ప్రాజెక్టుల గేట్లు ఎత్తి గోదావరి నదిలోకి నీటిని వదలడంతో నదీ ప్రవాహం పంట చేలలో ప్రవహిస్తుంది. విద్యుత్ స్థంభాలు నేలకొరిగి విద్యుత్ సరఫరా నిలవడంతో వరి నాట్లు వేయడం ఆలస్యమవుతుందని రైతులు దిగులు పడుతున్నారు.

సంబంధిత అధికారులు నీట మునిగిన పంటలను సర్వే చేసి బాధిత రైతులకు ప్రభుత్వం నష్ట పరిహారం అందేలా చూడాలని రైతులు కోరారు. విద్యుత్ స్థంభాలను పునరుద్దరించి వెంటనే విద్యుత్ సరఫరా వ్యవసాయ పంపు సెట్‌లకు అందేలా చూడాలని గ్రామ ప్రజలు కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News