Sunday, December 22, 2024

వరద గోదావరి

- Advertisement -
- Advertisement -

భద్రాచలం వద్ద మళ్లీ క్రమంగా పెరుగుతున్న నీటి మట్టం కడెం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద
లోతట్టు గ్రామాల్లోకి వరద నీరు ఆనందపూర్ వంతెనపై నుంచి ప్రవాహం, తెలంగాణమహారాష్ట్ర నడుమ
రాకపోకలు బంద్ హైదరాబాద్ ఉస్మాన్ సాగర్ 6 గేట్లు ఎత్తివేత మూసీ లోతట్టు ప్రాంతాలకు హెచ్చరిక

ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలతో పెరుగుతున్న ప్రవాహం.. ఉధృతంగా పెన్‌గంగ

మన తెలంగాణ:  గోదావరి నదీ పరివాహకంగా మహారాష్ట్ర ,చత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నదిలో వరద ప్రవాహం పెరుగుతూ వస్తోంది. ఎగువ నుంచి శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి 1,57, 496 క్యూసెక్కుల వరదనీరు చేరుతోంది. ప్రాజెక్టు లో నీటినిలువ 56.94టిఎంసీలకు పెరిగింది. దిగువన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 1,92, 529 ఉండగా, గేట్ల ద్వారా దిగువ న దిలోకి 2,55, 320 నీటిని వదిలిపెడుతున్నారు. ప్రాజెక్టులో నీటి నిల్వ 16.82టిఎంసీల కు చేరింది. చత్తీస్‌గఢ్ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాణహిత నదిలో వరద ఉధృ తి కొనసాగుతోంది. ప్రాణహిత నది నుంచి మేడిగడ్డ వద్ద గోదావరిలోకి 6,10, 250 క్యూసెక్కుల నీరు చేరుతోంది. లక్ష్మీబ్యారేజీ గేట్లు తెరిచి వచ్చిన నీటిని వచ్చినట్టుగా దిగువకు వదిలిపెడుతున్నారు. మరో ఉపనది పెన్‌గంగ కూడా ఉధృతంగా ప్రవహిస్తోంది. జైనథ్, బేల మండలాల్లోని పలు గ్రామాల్లోని లోత ట్టు ప్రాంతాలను వరద నీరు ముంచెత్తింది. ఇళ్లలోకి వరద చేరడంతో జనం బిక్కుబిక్కమంటూ గడుపుతున్నారు. మహారాష్ట్ర తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల్లోని హైలెవెల్ బ్రిడ్జిని తాకుతూ వరదనీరు ప్రవహిస్తోంది. అనంద్‌పూర్ వద్ద బ్రిడ్జి వరదనీటిలో మునగడంతో ఈ మార్గంలో రాకపోకలు నిలిపివేశారు. క డెంలో వరద కొనసాగుతోంది. ఎగువ నుంచి కడెం ప్రాజెక్టులోకి 52,199 క్యూసెక్కుల నీరు చేరుతుండగా, ప్రాజెక్టు నుంచి బయటకు 73799 క్యూసెక్కు ల నీటిని వదిలిపెడుతున్నారు.

మంజీరా నదిలో వరద ప్రవాహం తగ్గింది. సింగూరు ప్రాజెక్టులోకి 6506 క్యూసెక్కుల నీరు చేరుతోంది.ప్రాజెక్టులో నీటి నిల్వ 20.86 టిఎంసిలకు పెరిగింది. ప్రాజెక్టుకు ఎగువ నుంచి 21,200 నీరు చేరుతోంది. ప్రాజెక్టులో నీటి నిలువ 10.18 టిఎంసిలకు చేరుకుంది. తాలిపేరులో కూడా వదర ఉధృతి కొనసాగుతోంది. ప్రాజెక్టు 12గేట్లు తెరిచి 19000 నీటిని దిగువకు వదులుతున్నారు. నదిలోకి వరద కలయికతో తుపాకుల గూడెం సమ్మక్కసాగర్ ప్రాజెక్టులోకి 8,79,450 వరదనీరు చేరుతుండగా, అంతే నీటిని దిగువకు వదిలిపెడుతున్నారు. దుమ్ముగూడెం వద్ద సీతమ్మ సాగర్ ప్రాజెక్టులోకి 8,11, 092క్యూసెక్కుల నీరు చేరుతోంది. బ్యారేజీ గేట్లు తెరిచి వచ్చిన నీటిని వచ్చినట్టుగా దిగువకు వదులుతున్నారు.

హిమాయత్‌సాగర్ 6గేట్లు ఎత్తివేత

ఎగువ పాంతాల్లో కురుస్తున్న వర్షాలతో మూసినదిలో వరద ఉధృతి పెరిగింది. హిమయత్ సాగర్ జలాశయంలో నీటిమట్టాలు గరిష్ట స్థాయికి చేరటంతో ఆరు గేట్లు ఎత్తివేశారు.జలాశయంలోకి 3500 చేరుతండగా గేట్ల ద్వారా దిగువ నదిలోకి 4200క్యూసెక్కుల వరదనీటని వదులు తున్నారు.మరోవైపు ఉస్మాన్ సాగర్‌లోకి కూడా వరదనీరు గణనీయంగా చేరుతోంది. నగరంలోని హుస్సేన్‌సాగర్‌లో కూడా నీటిమట్టం పెరగడంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. మూసీ పరీవాహకంగా నగరంలోని లొతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేస్తున్నారు.
భద్రాచలం 40.40 అడుగులకు నీటిమట్టం
గోదావరినదిలో వరద నీరు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతూ వస్తోంది. శనివారం భద్రాచలం వద్ద నీటి మట్టం 40.40 అడుగులకు చేరింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలను దృష్టిలో పెట్టుకుని గోదావరిలో వరద ఉధృతి పెరిగే అవకాశాలు ఉన్నాయని కేంద్ర జల సంఘం వెల్లడించింది. గోదావరి పరివాహకంగా లోత ట్టు ప్రాంతాలను అప్రమత్తం చేయాలని హెచ్చరించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News