కొత్తగూడెం భద్రాద్రి: భద్రాచలం వద్ద గోదావరి 43.40 అడుగులకు చేరినట్లు జిల్లా కలెక్టర్ ప్రియాంక అల తెలిపారు. గోదావరి నుండి 9 లక్షల 51 వేల 120 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ముంపుకు గురయ్యే పరివాహక ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. వరద ఉధృతి దృష్ట్యా ప్రజలు జిల్లా అధికారుల సలహాలు, సూచనలు పాటించాలని చెప్పారు. అధికార యంత్రాంగం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రియాంక అల సూచించారు. అత్యవసర సేవలకు కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేయాలని, ప్రజలు ఇళ్ల నుండి బయటికి రావొద్దని సూచించారు. పొంగిపొర్లుతున్న వాగులు దాటొద్దని చెప్పారు. రహదారులపైకి నీరు చేరిన ప్రాంతాల్లో రవాణా నియంత్రణ చేసేందుకు బారికేడింగ్ చేయడంతో పాటు ప్రమాద హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేయాలని రెవిన్యూ, పంచాయతి రాజ్
సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు. గ్రామ, మండల, జిల్లా స్థాయి యంత్రాంగం ముంపు ప్రాంతాల ప్రజలకు అందుబాటులో ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
43.40 అడుగులకు చేరిన గోదావరి వరద ఉధృతి
- Advertisement -
- Advertisement -
- Advertisement -