- Advertisement -
హైదరాబాద్: 100 ఏళ్ల చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో గోదావరికి వరద ఉధృతి పెరిగింది. పోలవరం ప్రాజెక్టు దగ్గర గోదావరి ఉగ్రరూపం దాల్చింది. అధికారులు ప్రాజెక్ట్ 48 గేట్లు ఎత్తి ఉంచారు. పోలవరం ప్రాజెక్టు నుంచి 9లక్షల క్యూసెక్కుల వరద దిగువకు విడుదల చేశారు. మధ్యాహ్నానికి 12లక్షల క్యూసెక్కుల వరద వస్తుందని అంచనా వేశారు. గంటగంటకు గోదావరి వరద ప్రవాహం పెరుగుతుంది. వరద ఉధృతితో ప్రాజెక్ట్ పనులు నిలిచిపోయాయి. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు దగ్గర గోదావరి నీటిమట్టం 32.2మీటర్ల చేరుకుంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ఆకస్మికంగా గోదావరికి భారీ వరద వచ్చి చేరుతోంది. గంటకు 35 సెంమీ చొప్పున గోదావరి నీటి మట్టం పెరుగుతుంది.
- Advertisement -