Monday, December 23, 2024

ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/కాళేశ్వరం: మహాదేవపూర్ మండలంలోని కాళేశ్వరం వద్ద ప్రాణహిత, గోదావరి నదులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా మహారాష్ట్ర తెలంగాణలో కురుస్తున్న వర్షాలకు ప్రాణహిత నది నుండి భారీగా వరద నీరు చేరడంతో కాళేశ్వరం వద్ద గోదావరి ఉదృతంగా ప్రవహిస్తుంది. ప్రాణహితలో భారీగా వరద నీరు చేరడంతో కాళేశ్వరం వద్ద గోదావరి 7.820 మీటర్ల ఎత్తున ప్రవహిస్తున్నట్లు సిడబ్లూసి అధికారులు తెలిపారు.

మరో వైపు భారీగా వరద నీరు చేరడంతో కన్నెపల్లి లక్ష్మీ పంప్ హౌస్ వద్ద ఆరు మోటార్లు ఆన్ చేసి నీటిని అన్నారం బ్యారేజ్‌కు తరలిస్తున్నారు. ఆరు మోటార్లు ఆన్ చేసి గ్రావిటీ కెనాల్ ద్వారా 12,708 క్యూసెక్కుల నీటిని అన్నారం బ్యారేజిలో ఎత్తిపోస్తున్నారు. అలాగే అధికంగా నీరు చేరడంతో మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్ద 85గేట్లకు గాను 35గేట్లు వదిలి నీటిని దిగువకు వదులుతున్నారు. బ్యారేజ్ వద్ద 2,05,970 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా గేట్లు ఎత్తడం ద్వారా 2,11,280 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో ఉంది ప్రస్తుతానికి మేడిగడ్డ బ్యారేజ్ వద్ద 10 టిఎంసిల నీటి నిల్వలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News