Sunday, November 24, 2024

ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి…. రెండో ప్రమాద హచ్చరిక జారీ

- Advertisement -
- Advertisement -

రామన్నగూడెం: ములుగు జిల్లా రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద గోదావరి వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. గోదావరి వరద ప్రవాహం 15.9 మీటర్లకు చేరడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. జంపన్న వాగు ఉధృతితో ఏటూరు నాగారం మండలం బూటరం గ్రామం నీటిలో మునిగిపోయింది. లోతట్టు గ్రామాల ప్రజలను ఏటూరునాగరంలోని వైటిసి పునరావాస కేంద్రానికి తరలిస్తున్నారు. తుపాకుల గూడెం సమ్మక్క సాగర్ బ్యారేజ్‌కు భారీగా వరద నీరు చేరుతోంది. సమ్మక్క సాగర్ ప్రాజెక్టు నుంచి 59 గేట్లు ఎతివేసి13,85,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

Also Read: ఫాతిమాగా మారిన అంజూ.. మతం మార్చుకొని ప్రియుడితో పెళ్లి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News