హైదరాబాద్: నగరంలోని జలసౌధలో గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం బుధవారం ముగిసింది. బోర్డు చైర్మన్ ఎం.పి.సింగ్ ఆధ్వర్యంలో ఇరు రాష్ట్ర అధికారులు భేటీకి హాజరయ్యారు. తెలంగాణ స్పెషల్ చీఫ్ సెక్రకరీ , ఈఎన్సీ మురళీధర్ రావు , ఓఎస్డీ దేశ్ పాండే… ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, ఈఎన్సీ నారాయణ రెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. గెజిట్ నోటిఫికేషన్ అమలు, బోర్డు నిర్వహణ, ప్రాజెక్టుల డీపీఆర్ లపై చర్చించారు. తెలంగాణకు చెందిన చనాకా – కొరాటా ఆనకట్ట, చౌటుపల్లి హన్మంతురెడ్డి, చిన్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకాల డీపీఆర్‌లపై చర్చించామని అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వెంకటనగరం పంప్ హౌస్, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుల డీపీఆర్‌లపై చర్చించాం. రజత్ కుమార్, స్పెషల్ సీఎస్ గోదావరి బోర్డు పదమూడో సమావేశం ముగిసింది తెలంగాణకు చెందిన చనాకా – కొరాటా ఆనకట్ట, చౌటుపల్లి హన్మంతురెడ్డి, చిన్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకాల డీపీఆర్‌లపై మాట్లాడినట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వెంకటనగరం పంప్ హౌస్, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుల డీపీఆర్‌లపై చర్చించాం.. ప్రాజెక్టులకు సంబంధించిన అన్ని డీటెయిల్స్ మన సైడ్ నుంచి క్లియర్ గా ఉన్నాయి. ఈరోజు కూడా ఏపీ ప్రభుత్వం నుంచి అబ్జెక్షన్స్ పెట్టారు. మా సైడ్ నుంచి అన్ని పాత ప్రాజెక్టు లే కాబట్టి అనుమతులు క్లియర్ ఉన్నాయి. సిడబ్యూసికి కూడా పంపించామన్న అధికారులు జీఆర్ఎంబీ ఛైర్మెన్ ఏపీ అబ్జెక్షన్స్ రిజెక్ట్ చేసినట్టు తెలుస్తోంది.