Thursday, February 13, 2025

గోదావరికి రెండో ప్రమాద హెచ్చరిక జారీ

- Advertisement -
- Advertisement -

భద్రాచలం: ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద కారణంగా భద్రాచలం వద్ద నీటి మట్టం బాగా పెరిగింది. మంగళవారం మధ్యాహ్నం 47 అడుగులు దాటి ప్రవహిస్తోంది. ఇది సోమవారం 26 అడుగుల మేరకే ఉండింది. నీటి మట్టం పెరుగుతుండడంతో అధికారులు రెండో హెచ్చరిక జారీ చేశారు.

గోదావరి నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉందని కేంద్ర జల వనరుల శాఖ అధికారులు తెలిపారు. ఇక శబరి, సీలేరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో చింతూరు మండలంలోని అనేక గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. భద్రాచలం వద్ద నీటీ వేగం పెరుగుతోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News