Tuesday, November 5, 2024

మెట్ట ప్రాంతాన్ని ముద్దాడిన గోదావరి జలాలు

- Advertisement -
- Advertisement -
  • గౌరవెల్లి ఒడిలో.. గోదావరమ్మ పరవళ్ళు..
  • జల సవ్వడితో గౌరవెల్లి కలకలలు
  • త్వరలో సాఎం కెసిఆర్ చేతుల మీదుగా ప్రారంభం
  • బాహుబలి మోటార్లను ఆన్ చేసి నీటి విడుదల
  • ఎన్నో యేండ్ల కళ… సాకారమైతున్న వేళ
  • హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్

అక్కన్నపేట: మెట్ట ప్రాంత ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కల నెరవేరబోతుందని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్ అన్నారు. గురువారం హుస్నాబాద్ నియోజకవర్గం లోని అక్కన్నపేట మండలం గౌరవెల్లి ప్రాజెక్టు ట్రయల్ రన్ ను హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్ ప్రారంభించి గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 2023 తొలి ఏకాదశి పండుగకు ముందు, పండుగ తరువాత అన్నట్లుగా హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష కల నెరవేరిన రోజు ఈరోజు అన్నారు. ఈ పర్వదినం నుండి ప్రతిరోజు పండుగ రోజు ఈ ప్రాంత ప్రజలు కొన్ని ఎండ్లగా ఎదురు చూస్తున్న రోజు కాలం కలిసి వస్తేనే పంట లేకపోతే వలసదారులు వెతుక్కున్న మెట్ట ప్రాంతం హుస్నాబాద్ నియోజకవర్గాన్ని ఈరోజు గోదావరి జలాలు ముద్దాడాయి.

ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ దృఢ సంకల్పం, సిఎం కెసిఆర్ సహకారంతో గౌరవెల్లి ప్రాజెక్టు నేడు జలకళను సంతరించుకుందన్నారు. ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ అయినటువంటి గౌరవెల్లి ప్రాజెక్ట్ నేడు ట్రయల్ రన్ విజయవంతంగా ప్రారంభించి గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించి ఈప్రాంత రైతుల గుండెల్లో చిరస్థాయిగా ఎమ్మెల్యే సతీష్ కుమార్ నిలిచారు. గౌరవెల్లి ట్రయల్ రన్ తో మెట్ట ప్రాంతం గోదావరి జలాలను ముద్దాడాయి. ఈ ప్రాంతమంతా గోదావరి జలాలతో సత్సర్ శ్యామలంగా మారాయని ఎమ్మెల్యే సంతోషించారు. గౌరవెల్లి ప్రాజెక్టును గత పాలకులు 1.14 టిఎంసి చేశారు. అది కూడా వర్షాలు ఎక్కువగా వచ్చి వరదలు వస్తేనే నిండేటట్లుగా డిజైన్ చేశారని గుర్తు చేశారు.

కానీ సిఎం కెసిఆర్ భవిష్యత్తును ఆలోచించి 8.23 టిఎంసికి ప్రాజెక్టును మార్చారని 32 మెగావాట్ల 3 మోటార్లు 126 మీటర్లు ఎత్తిపోసే విధంగా మహా బాహుబలి మోటర్లు బిగించడం జరిగిందన్నారు. గుడాటిపల్లి భూనిర్వాసితుల గురించి ఎంత చెప్పుకున్నా చాలా తక్కువేనని వారి త్యాగం మరువలేనిదన్నారు. దేశంలో ఏ ప్రాజెక్టు నిర్వాసితులకు ఇవ్వని పరిహారం గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితులకు ఇప్పించడం జరిగిందన్నారు. నిర్వాసితులలో జిఆర్‌ఆర్ నెంబర్ లేని వారు, ఇల్లు లేని వారికి కూడా పరిహారం ఇప్పించామని కొంతమంది బిసి, ఎస్టీ, ఎస్సీ సోదరులకు భూమి పత్రాలు లేకున్నా కూడా చట్టం ప్రకారం సగం పైసలు రావాలి కానీ గౌరవ సీఎం కేసీఆర్ గారితో మాట్లాడి వందశాతం పరిహారం ఇప్పించామని అందరికీ న్యాయం చేసామని అన్నారు. నిర్వాసితులు ఎక్కడ కాలనీలుగా ఏర్పడి ఇండ్లు కట్టుకున్న దగ్గరికి వెళ్లి కొబ్బరికాయ కొట్టానన్నారు. వారికి అన్ని విధాలుగా సహకరించామని గృహలక్ష్మి పథకాన్ని మొదట గౌరవెల్లి నిర్వాసితులకు ఇస్తామన్నారు.

గౌరవెల్లి ప్రాజెక్టు కాలువల కోసం ఇంకా 2000 ఎకరాలు భూమి కావాల్సి ఉందని, 200 కోట్లు మంజూరు అయ్యాయని తెలిపారు. అలాగే కోహెడ, అక్కన్నపేట, కన్నారం కాలువలు పూర్తి అయ్యాయన్నారు. ఈ ట్రయల్ రన్‌కు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని హర్షాతికేతనాలు వ్యక్తం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా పరిషత్ చైర్మన్ సుధీర్ కుమార్, హుస్నాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ ఆకుల రజిత వెంకన్న, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఎడబోయిన రజని తిరుపతిరెడ్డి, హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట ఎంపిపిలు మాలోతు లక్ష్మీ బీలు నాయక్, లకావత్ మానస, కొప్పుల కీర్తి సురేష్, జడ్పిటిసిలు భూక్య మంగ శ్రీనివాస్, బిల్ల వెంకటరెడ్డి, నాగశ్యామల మధుసూదన్ రావు, ఇరిగేషన్ డిఈ రాములు నాయక్, హుస్నాబాద్, అక్కన్నపేట బిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు వంగ వెంకట్ రామ్ రెడ్డి, పెసరు సాంబరాజు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్‌లు కాసర్ల అశోక్ బాబు, లింగాల సాయన్న వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపిటిసిలు పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News