Monday, January 13, 2025

ధ్వజావరోహణంతో ముగిసిన పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు

- Advertisement -
- Advertisement -

తిరుప‌తి: తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు శుక్రవారం రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి. రాత్రి 9 గంటలకు ధ్వజావరోహణ ఘట్టం నిర్వహించారు. గజ పటాన్ని అవనతం చేసి ధ్వజారోహణం నాడు ఆహ్వానించిన సకల దేవతలను సాగనంపారు. బ్రహ్మోత్సవాలలో పాలు పంచుకునే వారు సమస్త పాపవిముక్తులై, ధనధాన్య సమృద్ధితో తులతూగుతారని ఐతిహ్యం, విషమృత్యు నాశనం, రాజ్యపదవులవంటి సకల శ్రేయస్సులు పొందుతారని విశ్వాసం ఉంది. ఈ కార్యక్రమంలో జెఇఒ వీరబ్రహ్మం, డిప్యూటి ఇఒ గోవింద రాజన్, ఆలయ అర్చకులు బాబు స్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News