Sunday, December 22, 2024

నాంపల్లి ఎగ్జిబిషన్  మైదానంలో అమ్మవారి విగ్రహం ధ్వంసం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్  మైదానంలో నెలకొల్పిన అమ్మవారి విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ద్వంసం చేశారు.   దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ప్రతి సంవత్సరం అమ్మవారి విగ్రహాన్ని ఎగ్జిబిషన్ సొసైటీ, సిబ్బంది ఆధ్వర్యంలో నెలకొల్పుతారు. బుధవారం రాత్రి దండియా ప్రోగ్రాం పూర్తి అయ్యే వరకు ఎగ్జిబిషన్  మైదానంలో పోలీసులు ఉన్నారు.  మొదటగా కరెంట్ కట్ చేసిన అనంతరం కెమెరాలు విరగగొట్టారు.

విగ్రహం చేతిని విరగకొట్టి, పూజ సమాన్లను చిందరవందర చేశారు. అమ్మవారి చుట్టూ ఉన్న బరికేడ్స్ ను కూడా దుండగులు తొలగించారు. స్థానికుల సమాచారం మేరకు అబిడ్స్ ఎసిపి చంద్ర శేఖర్ తన సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఏదో ఒక చోట హిందు ఆరాధ్య విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని భక్తుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  హిందూదేశంలో ఉన్నామా? ఇస్లామిక్ దేశంలో ఉన్నామా? అని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విగ్రహంపై దాడి చేసిన దుండగులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని అమ్మవారి భక్తులు, పలు హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News