Friday, January 10, 2025

గొప్ప థ్రిల్‌నిచ్చే ‘గాడ్ ఫాదర్’

- Advertisement -
- Advertisement -

Godfather Hindi trailer launch

భారతీయ చిత్రపరిశ్రమలోని ఇద్దరు మెగాస్టార్‌లు చిరంజీవి, సల్మాన్ ఖాన్ కలసి నటించిన ఆల్‌టైమ్ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ’గాడ్ ఫాదర్’. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్‌లపై ఆర్ బి చౌదరి, ఎన్‌వి ప్రసాద్ ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మించారు. ఈనెల 5న దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీలో గ్రాండ్ గా విడుదల కానున్న ఈ చిత్రం హిందీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ముంబయ్‌లో గ్రాండ్ జరిగింది. ఈ ఈవెంట్‌లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ “గాడ్ ఫాదర్ సినిమాలో ఒక బలమైన పాత్ర వుంది. ‘లూసిఫర్’లో ఆ పాత్రని చిత్ర దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ చేశారు. ‘గాడ్ ఫాదర్’లో ఈ పాత్రని సల్మాన్ భాయ్‌ను చేయమని అడిగితే… ‘నేను చేస్తాను’ అని మాపై ఎంతో ప్రేమ చూపించారు సల్మాన్ భాయ్.

ఆయన ఓకే చేసిన తర్వాత ఈ సినిమా రేంజ్ మరింతగా పెరిగింది. సల్మాన్ భాయ్‌తో కలసి ఈ సినిమాని చాలా జోష్‌ఫుల్‌గా చేశాను. ఆ జోష్‌ని తెరపై చూస్తారు”అని అన్నారు. సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ “ఈ సినిమాలో చాలా కొత్త పాత్ర చేశాను. ‘గాడ్ ఫాదర్’ నా తొలి తెలుగు సినిమా. ప్రేక్షకులని ఖచ్చితంగా అలరిస్తుంది”అని తెలిపారు. దర్శకుడు మోహన్ రాజా మాట్లాడుతూ “ఇద్దరు మెగాస్టార్లని డైరెక్ట్ చేయడం నా కల నేరవేరినట్లయింది. ఈ సినిమా ప్రేక్షకులకు గొప్ప థ్రిల్‌నిస్తుంది” అని చెప్పారు. ఈ కార్యక్రమంలో సత్యదేవ్, ఆర్‌బి చౌదరి, ఎన్‌వి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News