Wednesday, December 25, 2024

అభిమానులకు బర్త్‌డే కానుకగా…

- Advertisement -
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్‌లపై ‘గాడ్ ఫాదర్’ చిత్రం రూపొందుతోంది. ఇక చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈనెల 21న ఈ సినిమా టీజర్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో గురువారం విడుదల చేసిన పోస్టర్‌లో చిరంజీవి సీరియస్‌గా కనిపిస్తున్నాడు. ఆయన బ్లాక్ షేడ్స్‌తో రఫ్ అండ్ స్టైలిష్ లుక్‌లో దర్శనమిచ్చాడు. ఈ చిత్రాన్ని ఆర్‌బి చౌదరి, ఎన్ వి ప్రసాద్ నిర్మిస్తుండగా కొణిదెల సురేఖ సమర్పిస్తున్నారు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తుండగా నయనతార కీలక పాత్రలో కనిపించనుంది. ఈ ఏడాది దసరా సందర్భంగా ‘గాడ్‌ఫాదర్’ని విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు.

Godfather Movie Teaser release on Aug 21

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News