లక్నో : రైతులు,కొవిడ్ యోధులు, ఉపాధ్యాయులు , మధ్యతరహా పరిశ్రమలకు తాయిలాలతో కాంగ్రెస్ ఉత్తరప్రదేశ్ ఎన్నికల మ్యానిఫెస్టోను రూపొందించారు. దీన్ని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా బుధవారం విడుదల చేశారు. గోధన్ న్యాయ్ యోజనను అమలు చేస్తామని, పాత్రికేయులపై తప్పుడు కేసులను ఉపసంహరించుకుంటామని రైతుల రుణమాఫీ, 20 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల కల్పన వంటివి హామీ ఇచ్చారు. చత్తీస్‌గఢ్‌లో తమ పార్టీ అధికారం చేపట్టిన తరువాత రైతుల రుణాలను రద్దు చేశామని, ఉత్తరప్రదేశ్‌లో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే రైతుల రుణాలను రద్దు చేస్తామని చెప్పారు. వరి, గోధుమలను క్వింటాలుకు రూ. 2,500 చొప్పున , చెరకును క్వింటాలుకు రూ. 400 చొప్పున కొంటామని తెలిపారు. విద్యుత్ బిల్లును సగానికి తగ్గిస్తామని , కొవిడ్ మహమ్మారి సమయంలో బాకీలను రద్దు చేస్తామని చెప్పారు. కొవిడ్ వల్ల దెబ్బతిన్న కుటుంబాలకు రూ. 25,000 చొప్పున చెల్లిస్తామన్నారు. ప్రభుత్వ రంగంలో ఖాళీగా ఉన్న 12 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. అదనంగా 8 లక్షల ఉద్యోగాలను సృష్టిస్తామన్నారు.
యుపి కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో గోధన్ న్యాయ్ యోజన
- Advertisement -
- Advertisement -
- Advertisement -