Thursday, January 23, 2025

బాలికపై అత్యాచారం?… బాబా అరెస్టు

- Advertisement -
- Advertisement -

ముంబయి: మైనర్ బాలికపై బాబా (58) అత్యాచారం చేసినట్టు ఆరోపణలు రావడంతో అతడిని పోలీసులు అరెస్టు చేసిన సంఘటన మహారాష్ట్రలోని వార్సోవా పోలీస్ స్టేషన్ పరిదిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2019 నుంచి తనపై బాబా పలుమార్లు అత్యాచారం చేశాడని బాలిక తన తల్లిదండ్రులతో కలిసి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి బాబాను అరెస్టు చేశారు.  2019లో పూజలు చేస్తానని నమ్మించి బాలికపై బాబా అత్యాచారం చేశాడు. అత్యాచారం చేస్తుండగా వీడియోలు తీశాడు. ఆ వీడియోలను చూపించి పలుమార్లు ఆమెను బెదిరించి అత్యాచారం చేశాడు. ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News