- Advertisement -
న్యూఢిల్లీ : ఎస్‌బిఐ(స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) భాగస్వామ్యంతో ఆయిల్ పామ్ రైతుల కోసం మొదటిసారిగా వినూత్నమైన ఫైనాన్స్ ఆఫర్‌ను ప్రారంభించినట్లు గోద్రెజ్ అగ్రోవెట్ ఆయిల్ పామ్ బిజినెస్ ప్రకటించింది. రైతులకు మైక్రో ఇరిగేషన్ సదుపాయం, పశువును రక్షించడానికి ఫెన్సింగ్, వారి ఆయిల్ పామ్ తోటల వద్ద గొట్టపు బావిని ఏర్పరచటానికి రుణాన్ని పొందేలా తోడ్పాటు అందిస్తుంది. ఫ్రెష్ ఫ్రూట్ బంచ్‌ల (ఎఫ్‌ఎఫ్‌బి) ఉత్పాదకతను మెరుగుపరచడం ద్వారా ఆయిల్ పామ్ పెరుగుదలకు సహాయపడే లక్ష్యంతో పరిచయం చేసిన ఈ సదుపాయంతో పంట మొదటి 5 ఏళ్ల కాలంలో తోటలను నిర్వహించడానికి ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది.
- Advertisement -