Monday, December 23, 2024

127 ఏళ్ల తర్వాత గోద్రెజ్ గ్రూప్ విభజన

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశంలో ప్రముఖ కుటుంబ వ్యాపారాల్లో గోద్రెజ్ ఒకటి అని చెప్పవచ్చు. దేశంలో టాటా, రిలయన్స్, వాడియా మాదిరిగానే గోద్రెజ్ మంచి పేరుంది. దేశంలో సబ్బు నుంచి గృహోపకరణాలు, రియల్ ఎస్టేట్ వరకు అనేక రంగాల్లో గోద్రెజ్ విస్తరించి వుంది. అయితే గోద్రెజ్ గ్రూప్ ఇప్పుడు విడిపోనుంది. 127 ఏళ్ల గ్రూప్‌ను రెండు భాగాలుగా విభజించేందుకు గోద్రెజ్ ఫ్యామిలీ ఒప్పందం చేసుకుంది. గ్రూప్ కంపెనీలు ఆది గో ద్రెజ్ నాదిర్ గోద్రేజ్(73), జంషీద్ గోద్రెజ్ (75) స్మితా గోద్రెజ్(74) మధ్య విభజన జరిగింది.

అర్దేశిర్ గోద్రెజ్ 1897 ఈ గ్రూప్‌ను స్థాపించారు. గోద్రెజ్ గ్రూప్ మార్కెట్ విలువ 4.1 బిలియన్ డాలర్లు ఉంటుంది. నివేదిక ప్రకారం, ఆది గోద్రేజ్, నాదిర్ గోద్రెజ్ ఈ విభజన కింద లిస్టెడ్ కంపెనీలలో మెజారిటీ వాటాను పొందుతారు. మ రోవైపు గోద్రెజ్ అండ్ బోయ్స్ నియంత్రణ జంషెడ్ గోద్రెజ్, స్మితా గోద్రెజ్‌లకు వెళనుంది. ఈ విభజనను ఖరారు చేసి త్వరలో బహిరంగంగా ప్రకటించనున్నారు. ఈ విభాగంలో రాయల్టీ, బ్రాండ్ వినియోగం, భూమి వినియోగం గురించి కూడా ప్రధాన నిర్ణయాలు తీసుకోవచ్చు. గ్రూప్‌లోని అన్‌లిస్టెడ్ కంపెనీలు, ల్యాండ్ బ్యాంక్ డెవలప్‌మెంట్‌ను జంషెడ్ గోద్రేజ్, స్మితా గోద్రెజ్‌లకు ఇవ్వవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం గోద్రెజ్ గ్రూప్ దీనిపై ఎలాంటి వివరాలను ప్రకటించలేదు.

గ్రూప్‌లో 5 కంపెనీలు
గోద్రెజ్ గ్రూప్‌లో 5 కంపెనీలు మార్కెట్లో లిస్ట్ చేసి ఉన్నాయి. వీటిలో గోద్రెజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్ లిమిటెడ్, గోద్రెజ్ ప్రాపర్టీస్, గోద్రెజ్ ఇండస్ట్రీస్, గోద్రెజ్ అగ్రోవెట్, అస్టెక్ లైఫ్‌సైన్సెస్ ఉన్నాయి. ఈ కంపెనీలు ఆది గోద్రెజ్, నాదిర్ గోద్రేజ్‌లకు వెళ్లవచ్చు. గోద్రెజ్ అండ్ బోయ్స్ ఒక ప్రైవేట్ కంపెనీగా ఉంది. కంపెనీ వెబ్‌సైట్ ప్రకారం, గోద్రెజ్ గ్రూప్‌లో దాదాపు 23 శాతం వాటా ట్రస్ట్ వద్ద ఉండగా, ఈ డబ్బును పర్యావరణం, ఆరోగ్యం, విద్య రంగాలలో ఖర్చు చేస్తున్నారు.

అనేక రంగాల్లో గోద్రెజ్ వ్యాపారం
గోద్రెజ్ గ్రూప్ వ్యాపారం ఇంజనీరింగ్, గృహోపకరణాలు, భద్రత, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, వినియోగదారు ఉత్పత్తుల రంగాలలో విస్తరించి ఉంది. 1897లో ఏర్పాటైన గోద్రెజ్ ఇండస్ట్రీస్ లి మిటెడ్, గోద్రెజ్ అగ్రోవెట్‌లో 64.89 శాతం, గోద్రెజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్‌లో 23.74 శాతం, గోద్రెజ్ ప్రాపర్టీస్‌లో 47.34 శాతం వాటాలను కలి గి ఉంది. గోద్రెజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్ గ్రూప్‌లో అతిపెద్ద కంపెనీగా ఉంది. ఏప్రిల్ 30న దీని మార్కెట్ క్యాప్ రూ.1.26 లక్షల కోట్లుగా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News