అంబేద్కర్ చెప్పిన బోధించు, సమీకరించు పోరాడు మార్గంలోనే ఉద్యమాన్ని నడిపాం
ప్లీనరీలో 7 తీర్మానాలు ప్రతిపాదిస్తాం :
ప్లీనరీ ఏర్పాట్లను పరిశీలించిన తర్వాత మంత్రి కెటిఆర్
టిఆర్‌ఎస్‌తోనే తెలంగాణ కల సాకారం
కనీవినీ ఎరుగని విధంగా టిఆర్‌ఎస్ ప్లీనరీ, భారీ ఎత్తున ఏర్పాట్లు
6వేల పైగా ప్రజా ప్రతినిధులకు ఆహ్వానం, 50 ఎకరాల్లో వాహనాల పార్కింగ్ సౌకర్యం
ప్లీనరీ వచ్చే ప్రతినిధులు గులాబీ రంగు దుస్తులు ధరించాలి, టిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్, ఐటి శాఖమంత్రి కెటిఆర్
మన తెలంగాణ/మాదాపూర్: దశాబ్దాల తెలంగాణ రాష్ట్ర కల ను టిఆర్‌ఎస్ సాకారం చేసిందని మున్సిపల్, ఐటీ శాఖమంత్రి కెటిఆర్ అన్నారు. శనివారం మాదాపూర్ హైటెక్స్‌లో ఈ నెల 25న నిర్వహించనున్న టిఆర్‌ఎస్ ద్వి దశాబ్ది ఉత్సవాలు, ప్లీనరీ పనులను కార్మికశాఖమంత్రి మల్లారెడ్డి, చేవెళ్ల పార్లమెంట్ సభ్యు లు రంజిత్‌రెడ్డి, ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎంఎల్‌ఎ అరెకపూడి గాంధీ, కూకట్‌పల్లి, జుబ్లీహిల్స్ ఎంఎల్ ఎలు మాదవరం కృష్ణరావు, మాగంటి గోపినాథ్, ఎంఎల్‌సిలు శంభీపూర్‌రాజు, నవీన్‌రావు, టిఎస్‌ఐసిసి చైర్మన్ గ్యాదరి బాల మల్లు, పౌరసరఫరాల చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎం ఎల్‌సి కర్నె ప్రభాకర్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, టిఆర్‌ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బండి రమేష్‌లతో కలిసి ప్లీన రీ ఏర్పాట్లను పరిశీలించారు. సభ వేదిక, ఎంట్రెన్స్ డెకరేషన్, భోజన హాల్స్‌లతో పాటు ప్లీనరీకి వచ్చే ప్రతి నిధుల వాహనల పార్కింగ్‌ల పనులను త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. అనంత రం ఆయన మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన ‘బో ధించు.. సమీకరించు.. పోరాడు’ అన్న మాటల స్ఫూర్తితో తెలం గాణ రాష్ట్ర ఉద్యమం కొనసాగిందన్నారు.
పద్నాలుగేళ్ల పాటు తెలంగాణ ప్రజలను జాగృతం చేసి జాతీయ రాజకీయాలను శాసించే శక్తిగా తెలంగాణ తీర్చిదిద్దిందన్నారు. స్వరాష్ట్రాన్ని సా ధించిన తరువాత అద్భుతమైన పరిపాలనతో పరిపాలన సంస్క రణలతో దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రంను తీర్చిదిద్దుతున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానాల కు, పాలనకు దేశంలోని ఇతర రాష్ట్రలతో పాటు పక్క రాష్ట్రంలో ఉన్న ప్రజాప్రతినిధులు సైతం తెలంగాణతో కలిసి పోవాలని డి మాండ్ చేయడం జరుగుతుందన్నారు. అంటే తెలంగాణ పాలన ఎంత అద్భుతంగా సాగుతుందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఇం తటి అద్భుతమైన పరిపాలన సాగుతున్న నేపథ్యాన్ని పురస్కరిం చుకొని 20ఏళ్లు ద్విదశాబ్ది సంబరాల నేపథ్యంలో హైదరాబాద్ లోని హైటెక్స్‌లో ప్లీనరీ పార్టీని నిర్వహించడం జరుగుతుందన్నా రు. ఇప్పటికే వారం, పది మా పార్టీ సీనియర్ నాయ కులు పార్టీ ప్లీనరీ ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు.
ఇంత తక్కువ సమయంలో అద్భుతమైన ఏర్పాట్లు చేసిన పార్టీ నాయ కులకు హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు తెలిపా రు. 25న నిర్వహించనున్న ప్లీనరీకి 6వేల మందికి పైగా టిఆర్ ఎస్ పార్టీ ప్రతినిధులు వస్తారన్నారు. వీరందర్నీ పార్టీ రంగు గు లాబీ దుస్తులు ధరించి రావాలని కోరుతున్నామన్నారు. జిల్లాల లోని టిఆర్‌ఎస్ పార్టీ ముఖ్య నాయకులకు శనివారం సాయం త్రం వరకు ప్లీనరీ ఆహ్వాన పాసులను అందిస్తామన్నారు. 25 నాడు ఉదయం 10 గంటలకు ప్లీనరీ ప్రారంభం అవుతుంద న్నారు. రాష్ట్రంలోని నియోజకవర్గలు, జిల్లాల వారీగా రిజిస్ట్రేష న్లు పూర్తిచేసుకొని 10గంటల 45 నిమిషల వరకు ప్లీనరీ ప్రాం గణంలోకి రావాలన్నారు. 11గంటలకు సభ కార్యక్రమం ప్రా రంభమవుతుందన్నారు.
జాతీయ పార్టీల లోపాయికార ఒప్పందం
గతంలో ఏ విధంగా అయితే కరీంనగర్, నిజామాబాద్, నాగా ర్జుసాగర్ ఎన్నికల్లో చీకటి ఒప్పందంతో పోటీ చేశాయో అదే విధంగా ఈ రోజున హుజూరాబాద్‌లో టిఆర్‌ఎస్ పార్టీ నిలువ రించే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకు లు, మాజీ ఎంపి విశ్వేశ్వర్‌రెడ్డి, బిజెపికి ఓటు వేయమని ఎలా మాట్లాడుతారన్నారు. రేవంత్‌రెడ్డి, ఈటల ఎ లా కలుస్తారన్నారు. రా్రష్ట్రంలో రెండు పార్టీలు ఎన్నిక ల్లో లోపాయికారి ఒప్పందాలు, కుట్రలు చేసినా ప్రజలు టి ఆర్‌ఎస్‌ను గెలిపిస్తారన్నారు. హుజూరాబాద్‌లో టిఆర్‌ఎస్ పార్టీ అభ్య ర్థి గెల్లు శ్రీనివాస్‌కు హుజూరాబాద్ ప్రజల ఆశీర్వాదం తప్పకుండా ఉందన్నారు.
సొంత పార్టీ నేతలే కాంగ్రెస్‌పై విమర్శలు
తెలంగాణ రాష్ట్ర పిసిసి పదవిని మాణిక్యం ఠాకూర్ కోట్ల రూ పాయలకు అమ్ముకున్నారని సొంత పార్టీ నేతలే చేసిన విమర్శల పై ఇప్పటివరకు స్పందించలేదన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ మూలాలు ఉన్న వ్యక్తులకు కాంగ్రెస్ పార్టీ అగ్ర తాంబూలం ఇస్తుందన్నా రు. కాంగ్రెస్‌లో పనిచేసిన సీనియర్ నాయకులు పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ చెప్పడం జరిగిందన్నారు.
దళితబంధు ఆపడం ఎంతవరకు సమంజసం?
తెలంగాణ రాష్ట్ర గాంధీ భవన్‌లో గాడ్సేలు దూరినట్లు తెలుస్తుం దన్నారు. ఎన్నికల కమిషన్ సైతం తన రాజ్యాంగబద్ధ్దమైన పరి ధిని దాటి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుందన్నారు. ఇప్పటికే ప్రా రంభమైన దళిత బంధు పథకాన్ని ఆపడం ఎంతవరకు సమం జసమో ఆలోచించుకోవాలన్నారు. ఇప్పుడు పక్క జిల్లాలకు మో డల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటున్న ఎలక్షన్ కమిషన్ భవిష్యత్తులో పక్క రాష్ట్రలకు సైతం విస్తరిస్తుందేమో అనిపిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్, మియాపూర్, శేరిలింగంపల్లి కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్, రాగం నాగేందర్ యాదవ్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్, నాయకులు శ్రీనివాస్‌గౌడ్, మధుసుదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.