Thursday, January 23, 2025

గాంధీని చంపిన గాడ్సేను బిజెపి వీరుడు అంటోంది: హరీష్ రావు

- Advertisement -
Godse killed gandhi
మెదక్: దేశ జిడిజి పెంచమంటే బిజెపి ప్రభుత్వం గ్యాస్, డీజీల్, పెట్రోల్ ధరలు పెంచి ప్రజల నడ్డి విరుస్తుందని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. ఆందోల్ నియోజకవర్గం తాలెల్మా గ్రామ శివారులో రేణుక ఎల్లమ్మ ఎత్తిపోతల పథకాన్ని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. నల్ల ధనం బయటకు వస్తుందని చెప్పి పెద్ద నోట్లు రద్దు చేసిందని, ఇంట్లో ఉండే చిన్న పెద్ద తేడా లేకుండా ఎటిఎం ముందు మోడీ ప్రభుత్వం నిలబెట్టిందని మండిపడ్డారు. ఎంత నల్ల ధనం బయటకు తీశారో చెప్పాలంటే నోరు మెదపడంలేదని మండిపడ్డారు. రైతుల నుంచి భూములు లాక్కునేందుకు నల్ల వ్యవసాయ చట్టాలు తెచ్చి వాళ్లను రోడ్డు మీదకు తీసుకొచ్చారని, లాఠీలతో కొట్టారని, తూటాలు పేల్చారని, కారుతో తొక్కించి చంపిన మోడీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము మంచి చట్టాలు తీసుకవస్తుంటే ఖలిస్తాన్ తీవ్రవాదులు అడ్డుకుంటున్నారని అని రైతులను అవమానించారన్నారు. ఏడాది పాటు జరిగిన రైతు పోరాటంలో 750 మంది దాకా అసువులు బాశారని చివరకు తప్పయిందంటూ ఆ చట్టాలను వెనక్కు తీసుకున్నారని హరీష్ రావు గుర్తు చేశారు.
ఇవాళ యువత మాకు ఉద్యోగాలు ఇవ్వండని కోరితే, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతున్నారని, ప్రైవేటు పరం చేస్తున్నారని, 16 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఒక్క ఉద్యోగం భర్తీ చేయడంలేదని మండిపడ్డారు. ఇప్పుడు దేశ మిలిటరీని ప్రైవేటు పరం చేస్తున్నారని, ఔట్ సోర్సింగ్ విధానాన్ని సైన్యంలో ప్రవేశపెడుతున్నారని, అంటే ఇక జీతాలు సరిగా ఉండవు, పెన్షన్ ఉండదు, సైనికులకు ఇచ్చే గౌరవం ఉండదని, ఇదా దేశ భక్తులు చేసే పని అని ప్రశ్నించారు.  గాంధీని చంపిన గాడ్సే ను కూడా బిజెపి వీరుడు అంటుందని హరీష్ చురకలంటించారు. గాంధీని కించపర్చిన వాళ్ళు బిజెపిలోనే ఉన్నారని, అగ్ని పథ్ పేరుతో బిజెపి ఇవాళ దేశంలో అగ్గి రాజేసిందన్నారు. యువత అ శాంతితో ఉడికిపోతుందని, వారిని పిలిచి చర్చించాల్సింది పోయి కాల్పులు జరిపితే తెలంగాణ యువకుడు అమరుడయ్యాడన్నారు. యువతను బిజెపి రెచ్చగొడుతుందని, కాల్చుతామని, కేసులు పెడతామని బెదిరిస్తోందన్నారు. ఇదా పాలన అంటే దేశానికి సేవ చేసే సైనికులకు ఇస్త్రి, కటింగ్ చెయించడం నేర్పుతున్నామంటున్నారని.. దీనికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమాధానం ఇవ్వాలని అడిగారు.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News