Monday, December 23, 2024

రా రమ్మందీ ఊరు…

- Advertisement -
- Advertisement -

హీరో సత్యదేవ్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘గాడ్సే’. గోపి గణేష్ పట్టాభి దర్శకుడు. సి.కె. స్క్రీన్స్ బ్యానర్‌పై సి.కళ్యాణ్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 17న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా నుంచి ‘రా రమ్మందీ ఊరు..’ అనే వీడియో సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. సత్యదేవ్ లుక్, సునీల్ కశ్యప్ సంగీతం, సురేష్.ఎస్ సినిమాటోగ్రఫీ హైలైట్‌గా ఈ వీడియో సాంగ్ కొనసాగింది. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను రామ్ మిర్యాల పాడారు. ఈ సినిమాలో అవినీతిమయమైన రాజకీయ నాయకులను, వ్యవస్థను ఒంటి చేత్తో ఎదుర్కొనే ధైర్యవంతుడైన యువకుడి పాత్రలో సత్యదేవ్ కనిపించనున్నారు. ఐశ్వర్య లక్ష్మి ఇందులో ఇన్విస్టిగేషన్ ఆఫీసర్‌గా కనిపించనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News