- Advertisement -
హీరో సత్యదేవ్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘గాడ్సే’. గోపి గణేష్ పట్టాభి దర్శకత్వంలో సికె స్క్రీన్స్ బ్యానర్‌పై సి.కళ్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ఈనెల 17న గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు గోపీ గణేష్ పట్టాభి మాట్లాడుతూ “ఈ సినిమా కథ వినగానే కళ్యాణ్ గొప్ప సినిమా తీస్తున్నామని అన్నారు. మన దేశంలో 6.7 శాతం మంది మాత్రమే వారి చదివిన చదవుకి సరైన అర్హత ఉండే పోస్ట్ చేస్తున్నారు. మిగిలిన వాళ్లు అలా చేయడం లేదు. అందరి మనసుల్లోని ప్రశ్నలను ‘గాడ్సే’ ప్రశ్నించబోతున్నాడు. ఇది ఓ యూత్ ఫిల్మ్. లవ్ స్టోరీ కూడా ఉంటుంది. ఈ సినిమాలో సత్యదేవ్, ఐశ్వర్య లక్ష్మీ అద్భుతంగా నటించారు”అని అన్నారు.
GODSE Movie to release on June 17
- Advertisement -