Thursday, January 23, 2025

క్వార్టర్ ఫైనల్లో గాఫ్, స్వియాటెక్

- Advertisement -
- Advertisement -

బోపన్న జోడీ ముందుకు..
ఫ్రెంచ్ ఓపెన్

పారిస్ : ప్రతిష్టాత్మమైన ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్‌లో యువ సంచలనం అమెరికా టెన్నిస స్టార్ కోకో గాఫ్ అద్భుతమైన ఆటతీరును ప్రదర్శిస్తోంది. ఆదివారం జరిగిన పోరులో కోకో గాఫ్ అలవోకగా గెలుపొంది క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఇటలీకి చెందిన ఎలిసబెట్టా కొకియారెట్టోపై 6-1, 6-2 తేడాతో గాఫ్ విజయం సాధించింది. ఈ 21 ఏళ్ల యువ సంలచనం వరుసగా నాలుగు ఫ్రెంచ్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్స్‌కు చేరిన తొలి అమెరికన్ మహిళగా నిలిచింది.

గాఫ్ తదుపరి పోరులో ఓన్స్ జబీర్ లేదా క్లారా టౌసన్‌తో తలపడనుంది. ఇక మరో పోరులో పోలాండ్ భామ ఇగా స్వియాటెక్ క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. ఏకపక్షంగా సాగిన ఈ పోరులో రష్యాకు చెందిన అనస్తాసియా పొటాపోవాపై 6-0, 6-0తో సునయాస విజయాన్ని అందుకుంది. కేవలం 40 నిముషాల్లోనే గేమ్‌ను ముగించింది. ఇక మంగళవారం జరుగనున్న క్వార్టర్ ఫైనల్‌లో ఐదో సీడ్ మార్కెటా ఒండ్రూసోవాతో తలపడుతుంది స్వియాటెక్.

బోపన్నజోడీ శుభారంభం..

డబుల్స్‌లో రోహన్ బోపన్న జోడీ శుభారంభం చేసింది. బ్రెజిలియన్ జంట ఓర్లాండోలూజ్, మార్సెలో జోర్మాన్‌పై మాథ్యూ ఎబ్డెన్(ఆస్ట్రేలియన్)తో కలిసి ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీని విజయంతో ఆరంభించారు. ఉత్కంఠభరితంగా సాగిన తొలిరౌండ్ పోరులో రెండో సీడ్ జోడీ 7-5, 4-6, 6-4 తేడాతో విజయం సాధించింది. వీరి ప్రారంభ మ్యాచ్ వర్షంతో వాయిదా పడిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News