వైరా : ఎంతో గొప్ప చదువులు చదవాలని ఆ తల్లిదండ్రులు ఆశ పడి తన కుమారుడి అక్షరాభ్యాసం సాక్షాత్తూ సరస్వతిదేవి చెంతనే చెపించి తిరిగి తమ సొంత గ్రామం మరో ఆరగంటలో చేరుకునేలోగా లారీ రూపంలో మృత్యువు ఆ కుటుంభాన్ని కబళించిన సంఘటన శుక్రవారం ఖమ్మం జిల్లా వైరాలోని స్టేజి పినపాక వద్ద చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన సమాచారం ప్రకారం కల్లూరు మండలం బోడిమల్ల తండాకు చెందిన బానోత్ బాబు కుమారుడు నవీన్‌తో రాంబాబు కుమార్తె అంజలి వివాహం ఐదేళ్ళ క్రితం జరిగింది. నవీవ్ అంజలీ దంపతులకు నాలుగేళ్ళ బాబు బాణోత్ కార్తికేయకు అక్షరాభ్యాసం చేయించుకొని గురువారం రాత్రి ఖమ్మం చేరుకున్నారు.
శుక్రవారం మధ్యాహ్మం ఖమ్మం నుంచి కారులో కల్లూరు మండలంలోని తమ స్వగ్రామానికి వస్తుండగా వైరాలోని స్టేజి పినపాక వద్ద తల్లాడ నుంచి ఖమ్మం వైపు వస్తున్న లారీ కారును ఢీ కొట్టడంతో ఆజ్మీరా రాంబాబు (50), వాత్సా నాయక్ తండాకు చెందిన అంజలి (25), శ్రీవల్లి (18 నెలలు) అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ఉన్న బాణోత్ రాణి, ప్రవీణ్, స్వాతిలకు తీవ్ర గాయాలు కావటంతో 108 ద్వారా ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి వైరా ఎసిపి రెహమాన్, సిఐ సురేష్, ఎస్‌ఐ నరేష్ చేరుకొని కేసు నమోదు చేసి దార్యాప్తు చేస్తున్నారు.