- Advertisement -
హైదరాబాద్: జ్యోతిరావు ఫూలే స్ఫూర్తితో విద్యనందించేలా ప్రభుత్వం పని చేస్తోందని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. భూ భారతి చట్టాన్ని ప్రజలకు అంకితం చేయబోతున్నామన్నారు. భద్రాద్రి మణుగురు ప్రజా భవన్ లో పొంగులేటి మీడియాతో సమావేశం అయ్యారు. గత ప్రభుత్వంలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుని రాజు చేస్తామని గత ప్రభుత్వం రైతులకు అన్యాయం చేసిందని మండిపడ్డారు. రైతు రుణమాఫీ చేసిన ప్రభుత్వం.. ఇందిరమ్మ ప్రభుత్వమని పేర్కొన్నారు. పోడు పట్టాలు సమస్య పరిష్కారం అయ్యేలా కృషి చేస్తామని పొంగులేటి స్పష్టం చేశారు.
- Advertisement -