Friday, December 20, 2024

శునకాన్ని కాపాడబోయి డ్యాంలో గల్లంతయ్యాడు..

- Advertisement -
- Advertisement -

రోపర్: పెంపుడు శునకాన్ని కాపాదే ప్రయత్నంలో 40 ఏళ్ల మెర్చంట్ నేవీ అధికారి ఒకరు పంజాబ్‌లోని మొరిండ సమీపంలోని భాక్రా కెనాల్‌లో గల్లంతయ్యారు. సోమవారం సాయంత్రం ఈ సంఘటన జరుగగా ఆ అధికారి కోసం మంగళవారం కూడా గాలింపు కొనసాగుతోంది. మొహాలీలోని సెక్టార్ 3బి1కు చెదిన రమణ్‌దీప్ సింగ్ తన భార్యా పిల్లలతోకోసం విహారయాత్ర నిమిత్తం సోమవారం భాక్రా కెనాల్‌కు వచ్చారు.

తమతోపాటు పెంపుడు శునకాన్ని కూడా వారు తీసుకెళ్లారు. హఠాత్తుగా శునకం కెనాల్‌లో పడడిపోవడంతో దానిని రక్షించేందుకు సింగ్ కెనాల్‌లో దూకారు. అయితే స్థానికులు శునకాన్ని రక్షించినప్పటికీ సింగ్ మాత్రం ప్రవాహంలో గల్లంతయ్యారని ఆయన సోదరుడు నేవీ అధికారి అయిన కెప్టెన్ జైవీర్ తెలిపారు. తన సోదరుడి కోసం ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలతో కలసి కెనాల్‌లో గాలిస్తున్నట్లు ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News