- Advertisement -
అలనాటి విలువైన అరుదైన గోల్కొండ నీలం వజ్రం ఇక వేలానికి రానుంది. గతబలో ఈ వజ్రానికి ఇండోర్, బరోడా మహారాజులు యజమానులుగా ఉండేవారు. వచ్చే నెల 14వ తేదీన బ్రహ్మండరీతిలో జరిగే క్రిస్టి వజ్రాల వేలం పాటలో ,ఈ వజ్రం దాదాపుగా రూ 300 కోట్ల వరకూ పలుకుతుందని భావిస్తున్నారు. జెనీవాలో జరిగే ఈ వేలంలో ప్రముఖ వజ్రాల వ్యాపారులు పాల్గొంటారు. ఓ నాజూకైన ఉంగరంలో పొదిగి ఉండే ఈ వజ్రం ధర మొత్తం మీద రూ 430 కోట్ల వరకూ పలుకుతుందని విశ్లేషిస్తున్నారు. 23.24 క్యారెట్ల బరువుతో ఉండే ఈ వజ్ర ఖచిత ఉంగరాన్ని ప్రఖ్యాత జువెలర్ సంస్థ జార్ తయారు చేసింది. ఉనికి తగ్గట్లుగానే రాజరికపు కళ, అసాధారణ వైవిధ్యపు రంగు , అనితర సాధ్యపు పరిణామంతో ఈ వజ్రం ఉంటుంది. ప్రపంచంలోనే ఇది అత్యంత అరుదైన వజ్రరాజం అని క్రిస్టి ఇంటర్సేషనల్ సంస్థ అధినేత రాహుల్ కడాకియా తెలిపారు. వేలానికి అందరిని ఆహ్వానించారు.
- Advertisement -