Monday, December 23, 2024

30న గోల్కొండ బోనాలు: తలసాని

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాలను రాష్ట్ర పండుగగా సిఎం కెసిఆర్ ప్రకటించారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.  ఆషాడ బోనాల ఉత్సవాల నిర్వహణపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్ష సమావేశం నిర్వమించారు. ఈ సందర్భంగా తలసాని మీడియాతో మాట్లాడారు. ఈ నెల 30 నుండి బోనాల ఉత్సవాలు ప్రారంభిస్తామని, 30న గోల్కొండ బోనాలు, 17న సికింద్రాబాద్ బోనాలు, 24న హైదరాబాద్ బోనాల ఉత్సవాలు జరుగుతాయన్నారు. తెలంగాణ రాష్ట్ర సంస్కృతికి ప్రతీక బోనాలు అని ప్రశంసించారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని పండుగలను నిర్వహిస్తూనే వస్తున్నామన్నారు.  ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలు బోనాల ఉత్సవాలు జరుపుకొనేలా ప్రభుత్వ ఏర్పాట్లు చేస్తుందన్నారు.  ప్రభుత్వం తరపున వివిధ ఆలయాలలో అమ్మవార్లకు ప్రభుత్వం తరపున పట్టువస్త్రాల సమర్పిస్తామని వివరించారు. 3 వేలకు పైగా దేవాలయాలకు 15 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, ప్రభుత్వ విప్ ప్రభాకర్, నగరానికి చెందిన ఎంఎల్ఎలు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, సికింద్రాబాద్, హైదరాబాద్ ప్రాంతాలకు చెందిన ఆలయాల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News