హైదరాబాద్ ః హైదరాబాద్ గోల్కొండ బోనాలకు అధికారులు ముహూర్తం ఖరారు చేశారు. గోల్కొండ కోటలో కొలువుదీరిన జగదాంబిక మహంకాళి అమ్మవారి బోనాలు జూన్ 22 నుంచి జులై 25 వరకు ఆలయ వర్గాలు నిర్వహించనున్నారు. మొత్తం 9 బోనాలను అమ్మవారికి సమర్పించనున్నారు. జూన్ 22న తొలి బోనం, 25న ఆదివారం రెండో బోనం , 29న మూడు, జులై 2న నాలుగు, జులై 6న ఐదు, జులై 9న ఆరు, జులై 13న ఏడు, 16న ఎనిమిది, జులై 20న తొమ్మది బోనంతో పూజ నిర్వహిస్తారు. గొల్కొండ కోట నుంచే తెలంగాణలో బోనాల ఉత్సవం ప్రారంభమవుతుంది.
Also Read: గ్రామస్థులు పోలీసుల మధ్య ఘర్షణ
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా ఈ బోనాల పండగ నిలుస్తుంది. ఎప్పటిలాగే గోల్కొండ కోటలో జగదాంబిక మహంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పిస్తారు. ఆడపడుచులంతా నెత్తిన బోనం ఎత్తుకుని అమ్మవారికి సమర్పిస్తారు. పోతురాజుల కోలాహలం, శివశక్తుల పూనకంతో భక్తులు భక్తి పరవశంలోకి వెళ్లిపోతారు. సికింద్రాబాద్ మహంకాళి బోనాలు తర్వాత జంటనగరాల్లో బోనాల సందడి ముగుస్తుంది. తెలంగాణలో అత్యంత వైభవంగా జరిగే బోనాలకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది.