Friday, December 20, 2024

జులై 07వ తేదీన గోల్కొండ బోనాలు ప్రారంభం

- Advertisement -
- Advertisement -

ఆషాఢ మాసంలో వచ్చే తెలంగాణ పెద్ద పండుగ బోనాలు. 2024 జూలై 7వ తేదీన గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారికి తొలి బోనాన్ని భక్తులు సమర్పించనున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర పండుగా ఆ రోజున ప్రభుత్వం సెలవు ప్రకటించనుంది. తెలంగాణ ఏర్పడిన తరువాత రాష్ట్ర పండుగగా బోనాలను ప్రకటించి అత్యంత వైభవంగా నిర్వహిస్తోంది. హిందూ క్యాలెండర్ ప్రకారం మహంకాళి దేవిని జరుపుకునే ఆషాడమాసంతో బోనాలు ప్రారంభమవుతాయి. అంటే జూలై 7వ తేదీ ఆదివారంతో బోనాలు ప్రారంభమై ఆగస్టు 4వ తేదీ ఆదివారంతో ఈ బోనాలు ముగుస్తాయి. హైదరాబాద్, తెలంగాణలోని ఇతర ప్రాంతాలలో, భక్తులు, ముఖ్యంగా మహిళలు బోనాలు జరుపుకోవడానికి ప్రత్యేకంగా అలంకరించిన కుండలలో అమ్మవారికి నైవేధ్యాలు సమర్పిస్తారు. జూలై 7వ తేదీ ఆదివారం – గోల్గొండ జగదాంబికకు తొలిబోనం సమర్పించడంతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. జూలై 11వ తేదీ గురువారం – రెండో పూజ, జూలై 14వ తేదీ ఆదివారం – మూడో పూజ జరుగనుంది.

జూలై 18వ తేదీన గురువారం – నాల్గవ పూజను, జూలై 21వ తేదీ ఆదివారం – ఐదో పూజ, జూలై 25వ తేదీ గురువారం -ఆరోపూజ, జూలై 28వ తేదీ ఆదివారం -ఏడో పూజ, ఆగస్ట్ 1వ తేదీన గురువారం – ఎనిమిదవ పూజ, ఆగస్టు 4వ తేదీ ఆదివారం – తొమ్మిదో పూజ చేస్తారు. హైదరాబాద్‌లో నెలరోజుల పాటు బోనాల పండుగను మూడు దశల్లో నిర్వహిస్తారు. గోల్కొండ బోనాలు అనంతరం సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో లష్కర్ బోనాలు నిర్వహిస్తారు. పాతబస్తీలోని లాల్ దర్వాజాలోని శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయంలో, హరిబౌలిలోని శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి ఆలయంలో ఉత్సవాలు జరుగుతాయి.

అమావాస్య తర్వాత వచ్చే …
ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో అమావాస్య తర్వాత వచ్చే గురువారం లేదా ఆదివారం గోల్కొండ కోటపై ఉన్న శ్రీ ఎల్లమ్మ(జగదాంబిక) ఆలయంలో బోనాల ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఈసారి ఆషాఢంలో అమావాస్య జూలై 5వ తేదీన వస్తుంది. తరువాత వచ్చే ఆదివారం (జూలై 7) నుంచి బోనాల ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇక్కడ మొదటి పూజ జరిగిన తర్వాత తెలంగాణలోని ఇతర ఆలయాల్లో బోనాల ఉత్సవాలు ప్రారంభమవుతాయి. గోల్కొండ తర్వాత, సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి, లాల్‌దర్వాజ మహంకాళి ఆలయంలో పూజలు జరు గుతాయి. ఆషాఢమాసంలో చివరి రోజు గోల్కొండ కోటలోనే చివరి బోనం పూజ జరుగుతుంది. దీంతో బోనాల ఉత్సవాలు పూర్తి అవుతాయి. గోల్కొండ కోటపై ఉన్న శ్రీఎల్లమ్మ(జగదాంబిక) ఆలయంలో జూలై 7నుంచి నెల రోజుల వరకు ప్రతి గురువారం, ఆదివారం బోనాలు ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News