- Advertisement -
హైదరాబాద్: జులై 13న గోల్కొండలో ఆషాడ బోనాలు ప్రారంభమవుతాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఆషాడమాసం బోనాల నిర్వహణ, ఏర్పాట్లపై ఎంసిఆర్హెచ్ఆర్డిలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తలసాని మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ నగరంలోని 25 ప్రాంతాల్లో బోనాలు జరుగుతాయని, కరోనా నేపథ్యంలో అన్ని ప్రాంతాల్లో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేశామన్నారు. మూడు కమిషనరేట్ల పరిధిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తామన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులు మహమూద్ అలీ, ఇంద్రకరణ్ రెడ్డి, మల్లారెడ్డి, మేయర్ విజయ లక్ష్మి, డిజిపి మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.
- Advertisement -