Tuesday, January 21, 2025

మధ్యయుగ తెలంగాణ చరిత్రకు దర్పణం

- Advertisement -
- Advertisement -

Sometimes it is felt that history is the study of forts too. For that matter, Indian history revolves around the forts. as the Forts have a symbolic represen tation to show the safety, security, architecture engineering skills, defensive systems on one hand and the glory, valour richness of those Dynasties on the other. In other words, the study of forts has become synonymous for the study of history too. ఈ వ్యాఖ్యానం మన దేశ చరిత్రకు ఎంతగానో తగినట్లుగా అనిపిస్తుంది ఆదిమ మానవుడు తన తొలినాటి వాస్తు నిర్మాణంగా Stone Hengeను నిర్మించిన దశ నుండి, కోట నిర్మాణం దాకా జరిగిన ప్రస్థానం గొప్ప నాగరికతా ప్రగతిని తెలియజేస్తుంది.

గణ రాజ్యాలు, షోడశ మహా జనపదాలు, మౌర్య వంశం, గుప్త వంశం వంటి సామ్రాజ్యాల నుంచి మొదలుకొని మేవాడ్, చిత్తోడ్, మరాఠా, ఢిల్లీ సుల్తాన్‌లు, మొగల్ చక్రవర్తుల దాకా ఆయా రాజ్యాల ఔన్నత్యాన్ని తెలిపే నిర్మాణాలుగా నిలిచినవి కోటలే! రాజ్యానికి ఉండాల్సిన లక్షణాల గురించి కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో “సప్తాంగ సిద్ధాంతాన్ని” ప్రతిపాదిస్తూ, అందులో దుర్భేద్యమైన కోట నిర్మాణం కూడా ఒకటని పేర్కొనడాన్ని బట్టి కోటలకు ప్రాచీన, మధ్యయుగ కాలాలలో ఉన్న ప్రాధాన్యత తేటతెల్లమవుతుంది.

ఇదంతా ఒక వైపు అయితే కోట నిర్మాణం, వాస్తు రీతి, కొండలను ఆసరాగా చేసుకుని ఇటుక, రాతి, మట్టి, ఇనుము లోహాలతో, సున్నపురాయి, గ్రానైట్‌లతో నిర్మించే రీతిగా ప్రత్యేక వాస్తు శిల్పానికి (Special Architecture) దారి తీసింది. దాని నిర్మాణంలో చూపించిన సాంకేతిక అంశాలు కూడా చరిత్ర అధ్యయనానికి, ఆయా కాలాల నాటి సామాజిక, ఆర్థిక, రాజకీయ, రక్షణాత్మక, సాంకేతిక అంశాల (Base for the Observation of Social, Economic, Politica l, Defensive, Technical Elements ) పరిశీలనకు ఆధారంగా నిలుస్తున్నాయి. ఇక కాకతీయుల విషయానికొస్తే ఎన్నో కోటలను నిర్మించిన పాలకులుగా, ముఖ్యం గా ఓరుగల్లు కోట నిర్మాణ రీతులతో ప్రత్యేకతను సాధించిన చక్రవర్తులుగా వారు ఖ్యాతి గడించారు.

1323లో కాకతీయ చక్రవర్తుల పతనానంతరం దక్కన్ పీఠభూమి ప్రాంతాన్ని పాలించిన ప్రధాన ముస్లిం చక్రవర్తుల కుతుబ్‌షాహీ కాగా, వారు నిర్మించి రాజధానిగా మలుచుకున్న గోల్కొండ కోట ఆ తర్వాత వందలాది సంవత్సరాల చరిత్రకు సాక్షిగా నిలిచింది. దక్కన్ పీఠభూమి భారత ఉపఖండంలోని భాగమైనప్పటికీ, దక్కన్ తనదైన అస్తిత్వాన్ని, ప్రత్యేకతలను, నిలుపుకుంటూ ఒక స్వతంత్ర ప్రతిపత్తిని ప్రకటించుకున్నది. ప్రతాపరుద్రుడు-II మరణించిన తర్వా త దక్షిణ భారతదేశంలో మహమ్మదీయ రాజుల పాలన ఉనికిలోకి వచ్చింది. భారత దేశపు దక్షిణ భూభాగం, ఢిల్లీ సుల్తానుల ఆధీనంలోకి వచ్చిన మాట వాస్తవమైన, వారి పాలనా యంత్రాంగం కేవలం పర్యవేక్షణాపరంగానే సాగడంతో అవకాశం చిక్కిన ప్రతిసారి స్థానిక పాలకులు స్వతంత్రంగా ప్రవర్తించేవారు. ఉదాహరణకు, హాసన్ గంగు బహమన్ షా స్వయంగా బహమనీ సామ్రాజ్యానికి రాజుగా ప్రకటించుకొని పాలన సాగించాడు.

కాలక్రమంగా, బహమనీ సామ్రాజ్య క్షేత్ర పరిధి ఐదు భాగాలుగా విడిపోయింది అందులో ఒకటి గోల్కొండ. బహమనీ రాజు ద్వారా గోల్కొండకు గవర్నర్‌గా పంపించబడిన సుల్తాన్ కులీ కుత్బుల్ -ముల్క్, 1538 A.D. లో స్వతంత్రతను ప్రకటించుకొని కుతుబ్ షాహి వంశాన్ని స్థాపించాడు. కుతుబ్ షాహీలు, దాదాపుగా రెండు వందల సంవత్సరాలు గోల్కొండను పాలించారు. చివరికి ఔరంగజేబు గోల్కొండపై దాడి చేసి మొఘల్ సామ్రాజ్యంలో విలీనం చేసాడు. సాధారణంగా చక్రవర్తుల వంశాల పేరు మీదుగా పాలన జరగడం, చరిత్రలో ఆయా కాలాలు ఆ విధంగానే గుర్తింపు పొందడం, చరిత్ర రచనకు చరిత్రకారులకు మూలంగా నిలబడడం సంప్రదాయం. కానీ దక్కన్ పీఠభూమి దక్షిణ భారతంలోని దాదాపు రెండు శతాబ్దాల పైగా చరిత్రకు సమానార్థకంగా గోల్కొండ కోట పేరుతో ప్రస్తావించబడడం విశేషం. అలాంటి విశిష్టతను సాధించిన గోల్కొండ పాలనలో గోల్కొండ కోటను రాజధానిగా చేసుకొని మొత్తం ఎనమండుగురు చక్రవర్తులు పాలించారు అనేది మనకు తెలుస్తుంది.

నిజానికి 1512లో బహమనీ రాజ్యం ఐదు స్వతంత్ర రాజ్యాలుగా విడిపోయిన తర్వాత, తెలంగాణా ప్రాంతం సుల్తాన్ కులీ కుతుబ్ షాహీ గోల్కొండ రాజ్యాన్ని స్థాపించారు. అయితే పూర్తి స్థాయిలో మాత్రం 1518 నుండే కుతుబ్ షాల ఏలుబడి మొదలయింది. అలా తెలంగాణా ప్రాంతం కులీ కుతుబ్ ఉల్ ముల్క్ (1518-1543), జంషీద్ కులీ (1843- 50), సుభాన్ కులీ (1550), ఇబ్రాహిం కులీ (1550- 1580), మహ్మద్ కులీ (1580-1612), సుల్తాన్ మహ్మద్ కుతుబ్ షా (1612 -26), అబ్దుల్లా కుతుబ్ షా (1626 -1672), అబుల్ హాసన్ తానిషా (1672- 1687)ల పాలనలో కొనసాగింది. ఈ చక్రవర్తులు తమ తమ రంగాలలో చేపట్టిన సంస్కరణలు, అమలు చేసిన విధానాలు చరిత్రలో నిలిచిపోయాయి. తెలంగాణ చరిత్ర ప్రస్థానంలో ముస్లిం చక్రవర్తుల పాలనకు బలమైన పునాదులు వేసి, నాటి దక్కనీ తెలంగాణాలో సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, మతపరమైన ఎన్నో పరిణామాలకు ఆలంబనగా నిలిచాయి.

ఇంకా చెప్పాలంటే నేటి తెలంగాణ సామాజిక ముఖచిత్రానికి వైవిధ్యభరితమైన హిందూ ముస్లిం సంస్కృతుల సమ్మిళిత రూపాలను అందించడంలో కుతుబ్ షాహీల పాలన కాలం ఎంత గానో ప్రభావితం చేసింది. అలాగే ఈ కాలం మధ్యయుగాల నాటి ఫ్యూడల్ సంస్కృతికి, కాకతీయుల కాలపు జీవన శైలికి , కుతుబ్ షాహీల జీవన తీరులకి వారధిగా నిలిచి, హిందూ ముస్లిం సంస్కృతుల ఆదాన ప్రదానాలకు సంధి కాలంగా నిలిచింది. అందుకే Knowing history is an another way of opening new vistas, unfolding the mysteries from the folded things and making a quick journey into the past and proceeding to a time travel, to unravel the unknown facts. Actually, what does History give us? Probably nothing. But enable us to revisit the past to find out the life of our ancestors and to learn lessons from their decisions and to build a bright errorless future for the next Generations. ఈ లక్ష్య సాధనలో ఈ గ్రంథం తెలంగాణ చరిత్ర అభిమానులకూ, చరిత్రకారులకు మాత్రమేకాక పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు కూడా ఎంతగానో ఉపయోగపడుతుందని, భారత దేశ చరిత్ర గురించి వారికి ఇదివరకే తెలిసినదానికి మరింత అదనపు విషయ పరిజ్ఞానాన్ని ఈ గ్రంథం అందిస్తుందని భావిస్తున్నాను.

ఈ గ్రంథ మూల రచయిత అబ్దుల్ మజీద్ సిద్ధిఖి ఈ గ్రంథాన్ని మొదట ఉర్దూలో 1939లో, ఆ తర్వాత దీనినే 1956లో ఇంగ్లీష్‌లో అనువదించారు. ఆతర్వాత గోల్కొండ చరిత్ర పై ఎన్ని పరిశోధనలు జరిగినా, మరెన్ని గ్రంథాలు వచ్చినా, వాటన్నిటికి ఆధారంగా నిలిచింది ఈ గ్రంథమే కావడం విశేషం. గోల్కొండ పాలకులు శక్తివంతమైన పరిపాలన, రాజకీయ వ్యవస్థను ఏర్పరిచి రెండు వందల సంవత్సరాలు ఏకధాటిగా పాలించారు. వీరి కాలంలో దక్కన్ పీఠభూమి కళలు, సంస్కృతి, సాంప్రదాయాలతో పరిఢవిల్లింది. ఉర్దూ, తెలుగు సాహిత్యం ఉన్నత శిఖరాలందుకుంది. ఉర్దూ ప్రధాన భాషాయెన, తెలుగు భాషకు సమున్నత స్థానం లభించి తెలుగు సాహితీకారులకు రాజ దర్బారులో పదవులు, గౌరవం దక్కాయి. సంఘటనలు, తారీఖులే కాకుండా, “గోల్కొండ చరిత్ర” చదవడం అంటే మన సంస్కృతి, మన కళలు, మన సాహిత్యాన్ని మరో విధంగా వీక్షించడమే. అందుకే అబ్దుల్ మజీద్ సిద్దిఖి రచన History of Golconda ను భాషా సాంస్కృతిక శాఖ తెలుగులో ముద్రించడం ఆనందంగా భావిస్తుంది. ఎంతో సాధికారికంగా అనువదించిన డా. రూప్‌కుమార్ డబ్బీకార్ గారికి అభినందనలు!.

మామిడి హరికృష్ణ
8008005231

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News