Monday, December 23, 2024

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు గోల్కొండ కోట ముస్తాబు

- Advertisement -
- Advertisement -

ఏర్పాట్లను పరిశీలించిన సిఎస్ శాంతికుమారి

మనతెలంగాణ/హైదరాబాద్:  స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు గోల్కొండ కోట ముస్తాబైంది. కోటలోని రాణిమహల్ లాన్స్‌లో ముఖ్యమంత్రి కెసిఆర్ మంగళవారం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో గోల్కొండ కోటలో మంగళవారం జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లను సిఎస్ శాంతికుమారి పరిశీలించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి వేడుకలను విజయవంతం చేయాలని ఆమె సూచించారు. పోలీస్, వివిధ శాఖల అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించిన సిఎస్ వారికి పలు సూచనలు చేశారు. తగిన బందోబస్తుతో పాటు ట్రాఫిక్ నిర్వహణ ఏర్పాట్లు చేయాలని, ట్రాఫిక్ మళ్లింపు విషయమై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆమె పేర్కొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదన్నారు. జెండా ఆవిష్కరణను చూసేందుకు అధిక సంఖ్యలో ప్రజలు వస్తారని వారికి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆమె ఆదేశించారు. ఎక్కడికక్కడా దేశ భక్తి తెలిపేలా అన్ని విధాలుగా ఏర్పాట్లు చేయాలని ఆమె తెలిపారు. మరోవైపు వేడుకల నిర్వహణకు సంబంధించి అధికారులు రిహార్సల్స్ నిర్వహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News