Monday, December 23, 2024

గోల్కొండ జగదాంబికకు బంగారు బోనం

- Advertisement -
- Advertisement -

చాంద్రాయణగుట్ట : భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో సప్తమాతృకలకు సప్త బంగారు బోనం సమర్పణలో భాగంగా గురువారం గోల్కొండ శ్రీ జగదాంబిక అమ్మవారికి బంగారు బోనం, పట్టువస్త్రాలు, ఒడి బియ్యం సమర్పించారు. ఉమ్మడి కమిటీ అధ్యక్షులు ఆలె భాస్కర్ రాజ్ నేతృత్వంలో పలు ఆలయాల, ఉమ్మడి ప్రతినిధులతో కలిసి గౌలిపురా శ్రీ మహంకాళి మాతేశ్వరి భారతమాత కోటమైసమ్మ దేవాలయం నుండి బ్యాండు, మేళతాళాలతో ఊరేగింపుగా బయలు దేరారు. బ్యాండు మోతలు, పోతరాజు నృత్యం మధ్య జోగిని నిషాక్రాంతి తలపై బంగారు బోనంతో చేసిన నృత్యం ఆకట్టుకుంది. ఉమ్మడి ప్రతినిధులు తొలుత లంగర్‌హౌస్‌కు చేరుకొన్నారు.

అక్కడి ప్రభుత్వ వేదిక నుండి రాష్ట్ర మంత్రులు మహమూద్ అలీ, ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు ఘన స్వాగతం పలికారు. గోల్కొండ చోటాబజార్ నుండి కోటకు తరలి వెళ్ళారు. ఆలయ నిర్వాహకులు ఉమ్మడి ప్రతినిధులకు ఘన స్వాగతం పలికారు. కోటపై వెలసిన శ్రీ జగదాంబిక ఎల్లమ్మ తల్లికి బంగారు పాత్రలోని నైవేద్యం, ఒడి బియ్యం, పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో గౌలిపురా కార్పొరేటర్ ఆలె భాగ్యలక్ష్మి, మాజీ కార్పొరేటర్లు పాశం సురేందర్, ఆలె జితేంద్ర, ఆలె లలిత, ఉమ్మడి మాజీ చైర్మన్లు గాజుల అంజయ్య, రాకేష్ తివారి, జె.మధుసూదన్ గౌడ్, ఆలయ అధ్యక్షులు ఎర్మని కైలాష్ గంగపుత్ర, ప్రధాన కార్యదర్శులు ఎ.మధుసూదనగిరి, ఇ.సుమన్ కుమార్ ముదిరాజ్, మాజీ అధ్యక్షులు ఎస్.మల్లేశం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News