Tuesday, November 5, 2024

గంజాయి ముఠా గుట్టు రట్టు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : నగరంలో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న ముఠా గుట్టును గోల్కోండ పోలీసులు, రాష్ట్ర యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారులు(టిఎస్‌ఎన్‌ఎబి) సంయుక్తంగా రట్టు చేశారు. పదిమంది ముఠా సభ్యుల్లో నలుగురిని అదుపులోకి తీసుకోగా(వారిలో ఒకరు మైనర్) మరో ఆరుగురు పరారీలో ఉన్నారు. అరెస్టయిన ముగ్గురు ముఠా సభ్యుల నుంచి 23.4 కిలోల గంజాయి, తరలించేందుకు వినియో గించిన కారుతో పాటు రూ.40.30లక్షల నగదును స్వాధీనం చేసుకున్నామని యాంటీ నార్కో టిక్ బ్యూరో ఎస్‌పి గుమ్మి చక్రవర్తి వెల్లడించారు. నిందితులకు సంబంధించిన 16 బ్యాంకుల ఖాతాల్లోని రూ.1.53 కోట్ల నగదును ఫ్రీజ్ చేశామని పేర్కొన్నారు .

నగరంలోని సిసిఎస్ కార్యా లయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. నిందితులు గంజాయిను కిలోకు రూ. 8వేలకు కొనుగోలు చేసిన నగరంలో ఐదు గ్రాముల చొప్పున ప్యాకెట్‌కు రూ. 250రూపాయలకు అమ్ముతూ కిలో 50వేల రూపా యల వరకు ఆదాయం పొందుతున్నారని వెల్లడించారు. ఇలా నిందితులు రోజుకు రూ.30వేల వరకు సంపాదిస్తున్నారన్నారు. నానక్‌రాం గూడలో భవన నిర్మాణ కార్మికులు ఎక్కువగా ఉన్నారని, వీరితో పాటు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు గంజాయిని విక్రయిస్తున్నారన్నారు. నిందితులంతా ఒకే కుటుంబానికి చెందిన వారని ఆయన పేర్కొన్నారు. స్వాధీనం చేసుకున్న మొత్తం సొత్తు రూ.4 కోట్లు అని ఆయన అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News