- Advertisement -
ముంబై: బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. గురువారం బులియన్ మార్కెట్‌లో 24 క్యా రెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 207 తగ్గి రూ.58,670కి చేరుకుంది. అదే సమయంలో 22 క్యారెట్ల ధర ధర రూ.53,742కి చేరుకుంది. ఈ నెలలో ఇప్పటివరకు బంగారం ధర రూ.1400కు పైగా తగ్గింది.
ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (ఐబిజెఎ) వెబ్‌సైట్ ప్రకారం, గురువారం వెండి ధరలో పెద్ద తగ్గుదల కనిపించింది. కిలో ధర రూ.1,380 తగ్గి రూ.68,753కి చేరింది. అంతకుముందు రూ.70,133గా ఉంది. జూన్ ప్రా రంభం నుంచి ఇప్పటివరకు బంగారం తగ్గుతూనే ఉంది. జూన్ 1న 10 గ్రాము లు రూ.60,113 ఉండగా, ప్రస్తుతం రూ. 58,670కి చేరింది. అంటే దీని ధర రూ.1,443 తగ్గింది.
- Advertisement -