Monday, December 23, 2024

బంగారం, వెండి ధరలు మరింత ప్రియం….

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: 2023-24 ఆర్థిక సంవత్సరంలో నికర పన్ను రాబడులు రూ. 23.3 లక్షల కోట్లుగా అంచనా వేశామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. బడ్జెట్ 2023-24 ప్రవేశ పెట్టిన సందర్భంగా లోక్‌సభలో ఆమె మాట్లాడారు. బంగారం, వెండి, వజ్రాల ధరలు మరింత ప్రియం కానున్నాయి.  ప్రాంతీయ గగన కెనెక్టివిటీ పెంపునకు అదనంగా 50 విమానాశ్రయాలు, వాటర్ ఏరోడ్రోమ్‌లు, అధునాతన ల్యాండింగ్ గ్రౌండ్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. దేశంలోని కీలక ప్రాంతాలలో కొత్తగా 157 నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేస్తామని వివరించారు.  జిడిపిలో ద్రవ్యలోటు 5.9 శాతంగా ఉండే అవకాశం  నిర్మలా సీతారామన్ తెలిపారు. 2025-26 నాటికి 4.5 శాతానికి పరిమితం చేయాలని లక్షంగా పెట్టుకున్నామని, బహిరంగ విపణి నుంచి రూ.15.43 లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చామని, మహిళలు, బాలికల కోసం మహిళా సమ్మాన్ బచత్ పత్ర పథకం తీసుకొచ్చామన్నారు. మహిళా సమ్మాన్ బచత్ పత్ర పథకం 2025 వరకు అమల్లో ఉంటుందన్నారు. రాష్ట్రాల జిఎస్‌డిపి లోటు 3.5 శాతం మించవద్దన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News