- Advertisement -
ముంబై : బంగారం, వెండి ధరలు దిగొస్తున్నాయి. మంగళవారం బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో భారీ పతనం కనిపిస్తోంది. మంగళవారం ఎంసిఎక్స్ మార్కెట్లో బంగారం 10 గ్రాములు రూ.57,426 వద్ద ప్రారంభమైంది, ఇంట్రాడే కనిష్టం రూ.56,565 వద్ద కనిపించింది. అదే సమయంలో వెండి ధర కిలో రూ.69,255 వద్ద ప్రారంభించి, ఇంట్రాడేలో రూ.65,666కు పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్ల బలహీన పరిస్థితుల ప్రభావం ఎంసిఎక్స్‌పై కనిపించింది. హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ హెడ్ (కమోడిటీ అండ్ కరెన్సీ) అనూజ్ గుప్తా ప్రకారం, రాబోయే రోజుల్లో ఈ తగ్గుదల కొనసాగవచ్చు, 10 గ్రాముల బంగారం రూ.56 వేలకు చేరుకోవచ్చు.
- Advertisement -