Monday, December 23, 2024

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా బంగారం, వెండి ధరలు పెరిగాయి. బుధవారం పెరిగిన ధరల ప్రకారం తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాలు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారంపై రూ.120 మేర పెరిగి రూ.55,100 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.60,100 ఉంది. మరోవైపు, కేజీ వెండి ధర రూ.300 మేర పెరిగి రూ.78,000కు చేరుకుంది.

ఇక, దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,130 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.60,130గా ఉంది. అర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55.100, 24 క్యారెట్లు బంగారం రూ.60,100గా కొనసాగుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,500, 24 క్యారెట్ల బంగారం 60,550 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55.100, 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,100గా కొనసాగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News