Thursday, January 23, 2025

పెరగనున్న బంగారం, వెండి ధరలు

- Advertisement -
- Advertisement -

Gold and silver prices to rise

దీపావళికి ముందు భారీగా కొనుగోళ్లు

న్యూఢిల్లీ: దీపావళి పండుగ సీజన్ ప్రారంభమైంది. కొద్ది రోజుల్లో ధన్తేరస్, దీపావళి పండుగ జరుపుకోనున్నారు. దీంతో ప్రజలు బంగారం, వెండిని ఎక్కువగా కొనుగోలు చేస్తారు. అక్టోబర్ 10 నుంచి కార్తీక మాసం ప్రారంభం కానుంది. ఈ పరిస్థితిలో కార్తీక మాసం ప్రారంభానికి ముందు, గత వారంలో బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి లోహాల ధరలు గణనీయంగా పెరిగాయి. అక్టోబర్ 3 నుంచి -7 మధ్య బంగారం ధర(10 గ్రాములు) రూ. 1,378 పెరిగింది. అదే సమయంలో వెండి ధరలో కిలోకు రూ.3,531 పెరుగుదల నమోదైంది. ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (ఐబిజెఎ) అధికారిక వెబ్‌సైట్‌లో ఇచ్చిన సమాచారం ప్రకారం, అక్టోబర్ 3న 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.50,387గా ఉంది, ఇది అక్టోబర్ 7న రూ.51,765కి పెరిగింది.

మరోవైపు వెండి విషయానికి వస్తే, వారం ప్రారంభంలో కిలో ధర రూ.57,317 ఉండగా, 7వ తేదీన రూ.60,848కి చేరింది. ఐబిజెఎ ధరలో జిఎస్‌టి, మేకింగ్ చార్జీలు ఉండవని గమనించాలి. అయితే వివిధ రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు భిన్నంగా ఉంటాయి. పెరుగుతున్న బంగారం ధరల కారణంగా నకిలీ ఆభరణాలు మార్కెట్‌లో ఎక్కువగా వస్తున్నాయి. ప్రజలు నిజమైన, నకిలీ బంగారం మధ్య తేడాను సరిగ్గా గుర్తించడానికి ఐఎస్‌ఒ (ఇండియన్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్) బంగారం కొనుగోలు చేసే ముందు హాల్‌మార్క్‌ను తనిఖీ చేయాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News