Wednesday, January 22, 2025

విమానం టాయిలెట్ నుంచి రూ.2 కోట్ల విలువైన బంగారు కడ్డీలు స్వాధీనం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఢిల్లీ లోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో టెర్మినల్ 2 వద్ద ఆగి ఉన్న అంతర్జాతీయ విమానం టాయిలెట్‌లో ఆదివారం రూ.2 కోట్ల విలువైన నాలుగు బంగారు కడ్డీలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈమేరకు మొదట సమాచారం అందడంతో తనిఖీలు చేపట్టామని అధికారులు చెప్పారు.

దేశీయ పర్యటనలు పూర్తి చేసుకున్న అంతర్జాతీయ విమానం టెర్మినల్ 2 వద్ద ఆగినప్పుడు ఈ సంఘటన వెలుగు చూసిందని చెప్పారు. విమానం లోని వాష్ రూమ్‌లో సింక్‌కు దిగువన టేప్‌తో అతికించిన బూడిద రంగు పర్సును కనుగొన్నారు. అందులో మొత్తం మూడు వేల గ్రాముల బరువు గల నాలుగు బంగారు కడ్డీలు ఉన్నాయని, వీటి ధర సుమారు రూ.2 కోట్లు పైనే ఉంటుందని పేర్కొన్నారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News