Sunday, December 22, 2024

లాల్‌దర్వాజ అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన పివి సింధు

- Advertisement -
- Advertisement -

Badminton Star Sindhu offers Gold Bonalu at Lal Darwaja

హైదరాబాద్: పాతబస్తి లాల్‌దర్వాజ సింహవాహిని లాల్ దర్వాజా అమ్మవారికి ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పి.వి సింధు ఆదివారం బంగారు భోనం సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా సింధు మాట్లాడుతూ.. గతేడాది బోనాల సమయంలో పోటీల వల్ల రాలేకపోయానని చెప్పారు. ఈ సారి అమ్మవారికి బోనం సమర్పించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఏటా అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని కోరుకుంటున్నానన్నారు. ప్రజలందరికీ బోనాల పండగ శుభాకాంక్షలు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News