Wednesday, January 22, 2025

శంషాబాద్‌లో భారీగా బంగారం పట్టివేత

- Advertisement -
- Advertisement -

Gold caught at Shamshabad Airport

హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. రూ. 3 కోట్ల విలువైన 7 కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. 9 మంది కొలంబో ప్రయాణికుల వద్ద బంగారం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆరుగురు ప్రయాణికురాళ్లు బంగారాన్ని ప్యాంటులో దాచి తరలించే ప్రయత్నం చేశారు. కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో బంగారం అక్రమ రవాణా గుట్టు రట్టైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న కస్టమ్స్ అధికారులు తొమ్మిది మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News