- Advertisement -
ఆదిలాబాద్: పిడుగుపాటుకు ఒంటిపై బంగారు గొలుసు కరిగిపోవడంతో ఓ మహిళకు తీవ్రగాయాలై పరిస్థితి విషమంగా మారింది. ఈ సంఘటన ఆదిలాబాద్‌లోని పొచ్చర సమీపంలోని దిమ్మ గ్రామ శివారులో చోటుచేసుకుంది. శివారులోని పొలంలో పనిచేస్తున్న బాధితురాలు శ్వేత పిడుగుపాటుకు తీవ్రంగా గాయపడింది. పిడుగుపాటుకు వచ్చిన వేడికి ఆమె మెడలోని బంగారు గొలుసు కరిగిపోయిందని స్థానికులు చెబుతున్నారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా, ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. భారీ వర్షాలు కురిసే సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. గత వారంలో రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు జోరుగా కురుస్తున్నాయి.
- Advertisement -