Sunday, December 22, 2024

రూ.63 వేలు దాటిన బంగారం

- Advertisement -
- Advertisement -

రూ.75,750కి చేరిన కిలో వెండి ధర

ముంబై : బంగారం ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. బుధవారం వరుసగా రెండో రోజు పసిడి ధరల పెరుగుదలతో 10 గ్రాముల బంగారం రూ.63 వేల మార్క్‌ను దాటింది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల పసిడి ధర రూ.820 పెరిగి రూ.63.530కి (24 క్యారెట్) చేరుకుంది. క్రితం రోజు ఇది రూ.62,560 వద్ద ఉంది. హైదరాబాద్‌లో 10 గ్రాముల బంగారం మంగళవారం రూ.62,560 ఉండగా, బుధవారం ఇది రూ.63,380కి పెరిగింది. ఇక ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (ఐబిజెఎ) వెబ్‌సైట్ ప్రకారం, 10 గ్రాముల బంగారం ధర రూ. 862 పెరిగి రూ. 62,775కి చేరింది.

అంతకుముందు మంగళవారం కూడా బంగారం ఆల్ టైమ్ హైలో ఉంది. మరోవైపు వెండి కూడా 76 వేలకు చేరుకుంది. వెండి ధర కూడా రూ.861 పెరిగి కిలో రూ.75,750కి చేరింది. అంతకుముందు ఇది రూ.74,889గా ఉంది. ఈ నెలలో ఇప్పటివరకు వెండి ధర రూ.5 వేలకు పైగా పెరిగింది. స్టాక్ మార్కెట్‌లో కొనసాగుతున్న ఒడిదుడుకుల కారణంగా బంగారానికి మద్దతు లభిస్తోందని హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ కమోడిటీ అండ్ కరెన్సీ హెడ్ అనూజ్ గుప్తా తెలిపారు. దీని వల్ల వచ్చే ఏడాదిలో ఈ బంగారం 10 గ్రాములకు రూ.67 వేలకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు.

పెరగడానికి 5 కారణాలు
ప్రపంచ మార్కెట్లలో భారీ ఒడిదుడుకులు
2024లో ప్రపంచవ్యాప్తంగా మాంద్యం ఏర్పడుతుందనే భయం
డాలర్ ఇండెక్స్‌లో బలహీనత
ప్రపంచ వ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు బంగారం కొనుగోలు చేస్తున్నాయి
పెరుగుతున్న ద్రవ్యోల్బణం నుండి బంగారం మద్దతు పొందుతోంది

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News