సిద్దిపేట: జిల్లా కేంద్రంలో కొలువైఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ 47వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో మంత్రి హరీష్ రావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సిద్దిపేట వెంకటేశ్వర స్వామి దేవాలయం ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది. బహుశా 1974 లో ఈ దేవాలయాన్ని పెద్ద జీయర్ స్వామి వారి శ్రీ హస్తాలచే ప్రతిష్టించ బడింది. ఎంతో ప్రాముఖ్యత…చరిత్ర కలిగిన దేవాలయం 47వ వార్షిక బ్రహ్మో త్సవాలు జరగడం సంతోషంగా ఉంది. దేవాలయంలో 50 లక్షలతో ధ్యాన మందిరం మొదటి అంతస్థు నిర్ణిస్తున్నాము. ఆలయాన్ని దినదినాభివృద్ది చేసుకుంటున్నాము. ఎంతో మహిమాన్వితమైన స్వామి మన వెంకన్న స్వామి. వచ్చే వార్షిక బ్రహ్మోత్సవాల వరకు బంగారు కిరిటాన్ని ఏర్పాటు చేసుకుందామన్నారు. సిద్దిపేట ప్రాంతం అంత ఒక ఆధ్యాత్మిక వైభావాన్ని ఒడిసి పట్టింది. ప్రజలంతా భక్తి బావనాలతో దేవున్ని కొలుస్తారు. ఈ ప్రాంతం అంత కూడా దేవాలయాలకు నిలయంగా మారింది ఎన్నో చారిత్రాత్మక దేవాలయాలు మన ప్రాంతంలో ఉన్నాయి. భోగేశ్వర ఆలయం అతి పురాతన దేవాలయం. కోటిలింగాల, శరబెశ్వర ఆలయలు సంతోషి మాత , పారుపల్లి రామాలయం ఇలా ప్రాచీన కట్టడాలు పుల్లూరు లక్ష్మీ నరసింహ క్షేత్రం ,బుగ్గ రాజేశ్వర స్వామి ,చంద్లపూర్ రంగానాయక స్వామి దేవాలయాలు చరిత్రకు పునాదులు. పట్టణంలో, గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నో చారిత్రక కట్టడాలు ఉన్నాయి. అంటే సిద్దిపేట జిల్లా ఒక ఆధ్యాత్మిక వైభవాల ఖిల్లా అని మంత్రి హరీశ్ పేర్కొన్నారు.
ఆ సంకల్పంతోనే సిద్దిపేట ఒక రిజర్వాయర్ల ప్రాంతంగా మారింది. అనంతగిరి పోచమ్మ నుండి కోమరెల్లి మల్లన్న దాకా రిజర్వాయర్లు నిర్మించుకున్నాం అంటే ఈ ప్రాంతం అంత ప్రాజెక్టుల నిలయంగా మారి భగవంతుని దీవెనలతో ప్రాంతం అంత సస్యశ్యామలం అయింది… రిజర్వయార్ ల జిల్లాగా మారిందని ఆయన తెలిపారు. గత ప్రభుత్వాలు చూసారు అసలు గిన్నీ సార్ల గుళ్లల్లకి వచ్చినారా… యాదగిరి గుట్ట 800పై చరిత్ర కలిగిన దేవాలయం గా దేవలయాన్ని పట్టించుకున్న పాపాన పోలె… మన సీఎం కేసీఆర్ సంవత్సరానికి 100 కోట్ల చొప్పున నిధులు కేటాయించిన గొప్ప ఆధ్యాత్మిక వైభవాన్ని.. శ్రీ నరసింహ స్వామి ఆలయాన్ని నిర్మించారు. పోయిన ప్రభుత్వాలు ఆలయాలనుండి నిధులు తీసుకున్న చరిత్ర చూసాం… కానీ మన ప్రభుత్వం మన సీఎం కేసీఆర్ పురాతన దేవాలయాలకు కోట్లు ఖర్చు చేసి అభివృద్ధి చేస్తున్న ఘనత మనదన్నారు.
మన జిల్లాలో ఇప్పటికి 70 కోట్లతో పురాతన ఆలయాలను, కొత్త దేవాలయాలను నిర్మించుకున్నాం. ఇంకా మరిన్ని నిధులతో పురాతన ఆలయాలను అభివృద్ది చేసుకుంటాం. ఏ ప్రభుత్వం ఆలయాలను గుర్తించలే… వాటి పరిస్థితి తెలుసుకోలే కానీ దేవాలయాలు బాగుంటే పూజలు బాగా జరుగుతేనే మనము బాగుంటం వర్షాలు సమృద్ధిగా కురిస్తాయని హరీశ్ రావు అన్నారు. ప్రస్తుతం దూప దీప నైవేద్యం పథకం ద్వారా మన జిల్లా లో 230 దేవాలయలకు రూ. 6000 చొప్పున ఇస్తున్నము. ప్రముఖ పుణ్యక్షేత్రాలలో భక్తుల సౌకర్యాలకు పెద్ద పీట వేస్తున్నామని చెప్పారు. ప్రసిద్ధ ఆలయాల్లో భక్తులకు అన్ని సదుపాయాలు, మన కొత్త రాష్ట్రం సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకన్నారు. దేవాలయలకు ఆధ్యాత్మికకు ఒక నిలయం అయింది. సిద్దిపేటలో వికాస తరంగిణి భవనం కూడా నిర్మించుకుంటున్నాం. దేవునికి సేవ చేయాలి ఆ సేవే మనల్ని మన పిల్లలని తరతరాలను కాపాడుతుంది అని అందరు ఆధ్యాత్మిక భావనతో పని చేయాలి అని దేవలయా అభివృద్దికి తోడ్పాటు అందియండని మంత్రి హీరీశ్ కోరారు.