ముంబయి: అక్షయ తృతియ పండుగకు పసిడి కొనుగోలు దారుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. బంగారం ధరలు భారీగా పెరిగన నేపథ్యంలో ఆభరణాల విక్రయాలు మందగించాయని తెలిపారు. కస్టమర్లు ఎక్కువగా లేదా రెండు గ్రాముల బంగారాన్ని ఎక్కువగా కొనుగోలు చేశారని వ్యాపారవర్గాలు తెలిపాయి. ప్రధానంగా దక్షిణాది ప్రాంతాల్లో విక్రయాలు ఆశాజనకంగా ఉన్నాయని పది గ్రాముల కంటే తక్కువ ఆభరణాలను ఎక్కువగా కొనుగోలు చేసినట్లు ఆలిండియా అండ్ జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ చైర్మన్ సాయం మొహ్రాతెలిపారు.
Also Read: మంథనిలో వేడెక్కుతున్న రాజకీయం
ఈ క్రమంలో చాలామంది కొనుగోలుదారులు పాత బంగారాన్ని ఎక్సేంజ్ చేసుకుని బదులుగా కొత్త బంగారాన్ని చేసినట్లు వ్యాపారులు తెలిపారు. కాగా పండుగ అనంతరంప్రధాన నగరాల్లో ధరలు తగ్గాయి. పది గ్రాముల పసిడి ధర అదేవిధంగా చెన్నైలో రూ.61,650, ముంబైలో రూ.60,820, ఢిల్లీలో రూ.60,970వద్ద అమ్మకాలు జరిగాయి.తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌లో 24క్యారెట్ల పసిడి ధర రూ.60,820గా పేర్కొన్నారు. కాగా వెండిధర శనివారంతో పోలిస్తే కేజీకి వద్ద ట్రేడ్ అయింది.