Monday, January 20, 2025

16 నెలల గరిష్ఠానికి గోల్డ్ ఇటిఎఫ్‌లు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఆగస్టు నెలలో గోల్డ్ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఇటిఎఫ్)లలో రూ.1,028 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇది 16 నెలల గరిష్ఠానికి చేరుకుంది. అమెరికాలో వడ్డీ రేట్లలో వరుసగా పెరుగుదల నేపథ్యంలో బంగారం ఇటిఎఫ్‌లకు డిమాండ్ పెరిగింది. అంతకుముందు 2022 ఏప్రిల్‌లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా గోల్డ్ ఇటిఎఫ్‌లో రూ.1,100 కోట్ల పెట్టుబడి పెట్టారు. ఈ సంవత్సరం అమెరికాలో వడ్డీ రేట్లు నిరంతరం పెరగడం వల్ల వీటిలో ఇన్వెస్ట్‌మెంట్ పెరిగింది.

మ్యూచువల్ ఫండ్ కంపెనీల సంస్థ అయిన యాంఫీ డేటా ప్రకారం, 2023లో గోల్డ్ ఇటిఎఫ్‌లో ఇప్పటివరకు 73.40 శాతం పెట్టుబడి ఆగస్ట్‌లోనే వచ్చింది. ఈ ఏడాది ఆగస్టు వరకు ఇందులో మొత్తం రూ.1,400 కోట్ల పెట్టుబడులు పెట్టారు. జూలైలో గోల్డ్ ఇటిఎఫ్‌లోకి రూ.456 కోట్లు వచ్చాయి. ఏప్రిల్-జూన్‌లో ఈ కేటగిరీలో రూ.298 కోట్లు మాత్రమే ఇన్వెస్ట్ చేశారు. అంతకుముందు వరుసగా మూడు త్రైమాసికాల్లో గోల్డ్ ఇటిఎఫ్‌లలో అమ్మకాలు కనిపించాయి. పండగ సమయంలో బంగారం, వెండికి డిమాండ్ పెరుగుతుంది. అయితే దీపావళి నాటికి 10 గ్రాముల బంగారం ధర రూ.62,000, వెండి కిలో రూ.78-,800 వేలకు చేరనుంది. 2023 చివరి నాటికి బంగారం రూ.65,000, వెండి రూ.90,000కి చేరే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News