Thursday, January 23, 2025

భారత్ టీమ్‌కు పసిడి

- Advertisement -
- Advertisement -

ఆసియా టీమ్ ఛాంపియన్ షిప్ గెలుచుకున్న పివి సింధూ జట్టు

మలేసియా(షా అలామ్) : భారత బాడ్మింటన్ మహిళల టీమ్ చరిత్ర సృష్టించింది. ఆసియా టీమ్ ఛాంపియన్ షిప్‌ను తొలిసారి గెలుచుకొని నయా రికార్డును నెలకొల్పింది. హోరాహోరీగా సాగిన తుదిపోరులో థాయ్‌లాండ్‌ను 3-2 తేడాతో చిత్తు చిత్తుచేసి ఛాంపియన్‌గా అవతరించింది.కాగా, భారత బ్యాడ్మింటన్ చరిత్రలో ఆసియా ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకోవడం ఇదే తొలిసారి. నువ్వా నేనా అన్నట్లు సాగిన ఈ పోరులో భారత్ థాయ్‌లాండ్‌ను ఎదుర్కొవడంతో కొంత కష్టించాల్సి వచ్చింది. అయినా భారత క్రీడాకారులు అద్భుత ఆటతీరుతో 2 సింగిల్స్, మరో డబుల్‌లలో విజయం సాధించారు.

సింగిల్స్‌లో పివి సింధు, అన్‌మోల్ ఖర్బ్ విజయం సాధించగా డబుల్స్‌లో గాయత్రీ గోపిచంద్- -జోలీ త్రిశా జోడీ విజయం సాధించారు. ఈ తుది పోరులో స్టార్ షట్లర్ పివి సింధు రెండు సెట్లలోనే మ్యాచ్ ముగించింది. 39 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌కు షట్లర్ సుపనిద కతెతోంగ్‌ను 21-12, 21-12 తేడాతో మట్టికరిపించింది. సింధు శుభారంభంతో భారత్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇక రెండో మ్యాచ్‌లో గాయత్రీ గోపిచంద్ -జోలీ త్రిశా జోడీ విజయం సాధించారు. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో థాయ్‌లాండ్ షట్లర్లు కితిథరకుల్-రవ్విందాపై 21-16, 18-21, 21-16 తేడాతో విజయం సాధించి భారత్‌ను 2-0 ఆధిక్యంలోకి తీసుకెళ్లారు. చివరి నిర్ణయాత్మక మ్యాచ్‌లో అన్‌మోల్ అద్భుత విజయం సాధించింది. పోర్‌పిచాపై 21-14, 21-9 తేడాతో సునయాసంగా గెలుపొంది భారత్‌కు బంగారు పతకం సాధించి పెట్టింది. 2022లో థామస్ కప్‌ను నెగ్గిన భారత్‌కు ఆ తర్వాత ఇదే అతిపెద్ద టోర్నీ విజయం కావడం విశేషం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News